IPL 2022 Mega auction: ఉత్కంఠభరితంగా సాగిన తొలిరోజు ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. మొదటి రోజు అన్ని విభాగాల్లోని 96 మంది క్రికెటర్లను వేలంలోకి రాగా.. 74 మందిని పది ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. మరో 22 మందిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అందులో సురేశ్ రైనా, ఇమ్రాన్ తాహిర్, స్టీవ్ స్మిత్, షకిబ్ అల్ హసన్ వంటి టాప్ ప్లేయర్లూ ఉన్నారు. తొలి రోజు మెగా వేలంలో ఇషాన్ కిషన్ రూ. 15.25 కోట్లను (ముంబయి) దక్కించుకోగా.. తర్వాత దీపక్ చాహర్ (సీఎస్‌కే) రూ. 14 కోట్లు, శ్రేయస్ అయ్యర్ (కేకేఆర్) రూ. 12.25 కోట్లు, శార్దూల్ (డీసీ) రూ. 10.75 కోట్లు, పూరన్ (ఎస్‌ఆర్‌హెచ్), రూ.10.75 కోట్లు, హర్షల్ పటేల్ (ఆర్‌సీబీ) రూ.10.75 కోట్లు, హసరంగ (ఆర్‌సీబీ) రూ. 10.75 కోట్లు, ఫెర్గూసన్
(గుజరాత్ టైటాన్స్) రూ. 10 కోట్లు, అవేశ్ ఖాన్ (లఖ్‌నవూ) రూ. 10 కోట్లు, ప్రసిధ్ కృష్ణ రూ. 10 కోట్లను సొంతం చేసుకున్నారు.
KKR.. సగానికి పడిపోయిన కమిన్స్
IPL 2022 Mega auction Pat cummins: ఆస్ట్రేలియన్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఈసారి తిరిగి కోల్‌కతా జట్టులో చేరాడు. 2020 వేలంలో ఆ జట్టు అతడిని రూ.15.5 కోట్లకు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వల్ల రికార్డు నెలకొల్పాడు. అప్పటివరకు విదేశీ ఆటగాళ్లలో ఇంత మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా కమిన్స్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం ఆ ధరలో సగానికి పడిపోయాడు. కమిన్స్ కోసం ఈ మెగా వేలంలో ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపకపోగా కోల్‌కతానే తిరిగి రూ.7.25 కోట్లకు కొనుగోలు చేసింది.
నితీశ్ రాణా మంచి ధరే
IPL 2022 Mega auction nitish rana: కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన ఓపెనర్ నితీశ్ రాణా కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. కొన్నేళ్లుగా ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ నిలకడైన ప్రదర్శన చేస్తున్న ఈ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను ఈసారి ఆ జట్టు వదిలేసింది. ఈ క్రమంలోనే మెగా వేలంలో రూ.1 కోటి కనీస ధరకు నమోదు చేసుకోగా ఆ జట్టు ఈసారి రూ. 8 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది. గతసీజన్లో అదే టీమ్ 3.4 కోట్లకు అతడిని తీసుకుంది. 2015లో తొలిసారి ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అడుగుపెట్టిన అతడు 2017 వరకు ఆ జట్టులోనే కొనసాగాడు. ఇక 2018 నుంచి కోల్‌కతాలో రాణిస్తూ ఏటా 300 పైచిలుకు పరుగులు చేస్తున్నాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన కోల్‌కతా తిరిగి సొంతం చేసుకుంది.
ఈ రోజు జరిగిన వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను (రూ.12.5కోట్లు) రికార్డు ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. వీరితో పాటు షేల్డాన్ జాక్సన్ (రూ.30 లక్షలు), శివమ్ మావీలను (రూ.7.25 కోట్లు) కేకేఆర్ కొనుగోలు చేసింది.
రిటెయిన్ ఆటగాళ్లు: ఆండ్రూ రసెల్(రూ.12కోట్లు), వెంకటేశ్ అయ్యర్,వరుణ్ చక్రవర్తి (రూ.8కోట్లు), సునీల్ నరైన్(రూ.6కోట్లు)
Mumbai Indians.. ఇషాన్ కిషన్ అదరహో
IPL 2022 Mega auction Ishan Kishan: ఇషాన్ కిషన్.. మెగావేలంలో రికార్డు ధర పలికాడు. ముంబయి ఇండియన్స్ 15.25 కోట్లకు తీసుకుంది. గతేడాది అతడిని 6.20కోట్లకే దక్కించుకుంది. ఈ రోజు వేలంలో డెవాల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు) తీసుకుంది. బేసిల్ థంపిను రూ.30 లక్షలకు.. మురుగనన్ అశ్విన్‌ను రూ.1.60 కోట్లకు దక్కించుకుంది.
రిటెయిన్ ఆటగాళ్లు: రోహిత్‌శర్మ(రూ.16కోట్లు), బుమ్రా(రూ.12కోట్లు), సూర్యకుమార్‌యాదవ్(రూ.8కోట్లు), పొలార్డ్(రూ.6కోట్లు)
RCB.. పంట పడించుకున్న హర్షల్ పటేల్
IPL 2022 Mega auction Harshal patel: టీమ్‌ఇండియా యువ పేసర్ హర్షల్ పటేల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ మొత్తం వెచ్చించి తిరిగి దక్కించుకుంది. గతేడాది హర్షల్ మొత్తం 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, వేలానికి ముందు వదిలేసుకున్న ఆర్సీబీ తిరిగి ఈ మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. 2018లో హర్షల్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన దిల్లీ క్యాపిటల్స్ గతేడాది ట్రేడింగ్ పద్ధతిలో బెంగళూరుకు వదిలేసింది. దీంతో ఆ జట్టు తరఫున రాణించిన హర్షల్ ఇప్పుడు రికార్డు ధరతో పంట పడించుకున్నాడు.
వనిందు హసరంగ కనీస రూ.కోటి కనీస ధరతో పాల్గొనగా.. అతడిని రూ.10.75కోట్లకు దక్కించుకుంది. గతసీజన్లోనూ ఇతడు ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు.
తొలి రోజు వేలంలో జోష్ హెజిల్వుడ్(రూ.7.75కోట్లు), డుప్లెసిస్(రూ.7కోట్లు), దినేశ్‌కార్తిక్‌ను(రూ.5.50కోట్లు) దక్కించుకుంది. అనుజ్ రావత్ (రూ.3.40 కోట్లు), అకాశ్ దీప్ (రూ.20 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు) కూడా జట్టులో చేరారు.
రిటెయిన్ ప్లేయర్స్: అంతకుముందు కోహ్లీ(రూ.15కోట్లు), మ్యాక్స్‌వెల్(రూ.11కోట్లు), సిరాజ్‌ను(రూ.7కోట్లు)
IPL 2022 Mega auction chennai super kings: చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మెగా వేలంలో ఇప్పటివరకు నలుగరు ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసింది. అందులో దీపక్ చాహర్, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు ఉన్నారు. చాహర్.. గత సీజన్లో రూ.80లక్షలకు అమ్ముడుపోగా ఈ సారి ఏకంగా రూ.14కోట్ల ధర పలకడం విశేషం. బ్రావో గతేడాది రూ.4.40 కోట్లు దక్కించుకోగా ఈసారి కాస్త పెరిగి రూ.6.40 కోట్లకు సొంత గూటికి చేరాడు. ఇక ఉతప్ప గతేడాది రూ.3కోట్లకు తీసుకోగా ఈ సారి కనీస ధర రూ.2 కోట్లకే అదే జట్టు చెంతకు చేరాడు. అంబటి రాయుడును గతేడాది 2.20 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ సారి 6.75 కోట్లకు దక్కించుకుంది.
వీరితో పాటు ఈ రోజు వేలంలో బౌలర్లు తుషార్ దేష్పాండే, కేఎం ఆసిఫ్‌లను చెరో రూ. 20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది.
రిటెయిన్ ప్లేయర్స్: అంతకుముందు జడేజా(రూ.16 కోట్లు), ధోనీ(రూ.12 కోట్లు), మొయిన్ అలీ(రూ.8), రుతురాజ్ గైక్వాడ్‌ను(రూ.6కోట్లు)
Sunrisers Hyderabad.. నటరాజన్‌కు మంచి ధర
IPL 2022 Mega auction Natarajan: నటరాజన్ .. గతేడాది రూ.40లక్షలకు కొనగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి రూ.4కోట్లు వెచ్చించి ఇతడిని దక్కించుకుంది.
శనివారం వేలంలో కొనుగోలు చేసిన ఇతర ప్లేయర్లు.. నికోలస్ పూరన్ (రూ. 10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ. 8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ. 8.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), ప్రియమ్ గర్గ్ (రూ.20 లక్షలు), అభిషేక్ శర్మ (రూ.20 లక్షలు), కార్తిక్ త్యాగి (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ. 75 లక్షలు), జగదీశ సుచిత్ (రూ.20 లక్షలు)
రిటెయిన్ ఆటగాళ్లు.. కేన్ విలియమ్సన్(రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్, ఉమ్రన్ మాలిక్(రూ. 4 కోట్లు)
Delhi Capitals.. దిల్లీ క్యాపిటల్స్ తొలి రోజు వేలంలో తమ జట్టు పాత ఆటగాళ్లను ఎవరినీ తీసుకోలేదు.
ఈరోజు(శనివారం) వేలంలో శార్దూల్ ఠాకూర్(రూ.10.75కోట్లు), మిచెల్ మార్ష్(రూ.6.50కోట్లు), డేవిడ్ వార్నర్(రూ.6.25కోట్లు), కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.2కోట్లు), అశ్విన్ హెబ్బర్(రూ. 20 లక్షలు), శ్రీకర్ భరత్(రూ.2కోట్లు), కమ్లేష్ నాగర్కోటి(రూ.1.10కోట్లు), సర్ఫరాజ్ ఖాన్‌ను(రూ.20లక్షలు) దక్కించుకుంది.
రిటెయిన్ ఆటగాళ్లు: పంత్(రూ.16కోట్లు), అక్షర్ పటేల్(రూ.9కోట్లు), పృథ్వీ షా(రూ. 7.50కోట్లు), నోర్జే(రూ.6.5కోట్లు)
Rajasthan Royals.. రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ రోజు వేలంలో తమ జట్టు పాత ఆటగాళ్లను ఎవరినీ తీసుకోలేదు.
ఈరోజు వేలంలో ప్రసిద్ధ కృష్ణ(రూ.10కోట్లు), సిమ్రాన్ హెట్మయిర్(రూ.8.50కోట్లు), దేవదత్ పడిక్కల్(రూ.7.75కోట్లు), చాహల్ (రూ.6.50కోట్లు), రియాన్ పరాగ్ (రూ. 3.8 కోట్లు), ట్రెంట్ బౌల్ట్(రూ.8కోట్లు), అశ్విన్(రూ.5కోట్లు), కేసి కరియప్ప(రూ.30లక్షలు) ఎంచుకుంది.
రిటెయిన్ ప్లేయర్స్: సంజు శాంసన్(రూ.14కోట్లు), జాస్ బట్లర్(రూ.10కోట్లు), యశస్వి జైస్వాల్(రూ.4కోట్లు)
Punjab Kings: స్టార్ ఫినిషర్ షారుక్ ఖాన్‌ను తాను ప్రాతినిధ్యం వహించిన పాత జట్టు పంజాబ్ కింగ్స్ రూ.9కోట్లకు కొనుగోలు చేసింది. కగిసొ రబాడా(రూ.9.25 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75కోట్లు), రాహుల్ చాహర్‌ను (రూ.5.25కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ 3.80 కోట్లు, జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రభ్ సిమ్రాన్(రూ.60లక్షలు), ఇషాన్ పొరెల్(రూ.25లక్షలు)
రిటెయిన్ ఆటగాళ్లు: మయాంక్ అగర్వాల్(రూ.12కోట్లు), అర్షదీప్ సింగ్(రూ.4కోట్లు)
Gujarat Titans.. ఈ ఐపీఎల్‌లో కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ వేలానికి ముందు.. హార్దిక్ పాండ్య(రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్(రూ. 15 కోట్లు), శుభ్‌మన్ గిల్‌ను (రూ. 8కోట్లు) తీసుకుంది.
మెగావేలంలో తొలిపోజు.. లాకీ ఫెర్గూసన్(రూ. 10 కోట్లు), జేసన్ రాయ్(రూ. 2 కోట్లు), మహ్మద్ షమీని (రూ. 6.25 కోట్లు), అభినవ్ సదరంగని(రూ. 2.6 కోట్లు), రాహుల్ తెవాతియా(రూ.9కోట్లు), నూర్ అహ్మద్(రూ.30లక్షలు), రవిశ్రీనివాసన్ సాయి కిషోర్‌ను (రూ.3కోట్లు) తీసుకుంది.
LSG.. మరో కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తొలి రోజు వేలంలో ఎక్కువ మందినే కొనుగోలు చేసుకుంది.
వేలానికి ముందు కేఎల్ రాహుల్(రూ. 17 కోట్లు), మార్కస్ స్టయినిస్ (9.20 కోట్లు), రవి బిష్ణోయ్‌ను (రూ. 4 కోట్లు) తీసుకుంది.
మెగావేలంలో.. జేసన్ హోల్డర్(రూ. 8.75 కోట్లు), కృనాల్ పాండ్య(రూ. 8.25 కోట్లు), మార్క్ వుడ్(రూ. 7.50 కోట్లు), క్వింటన్ డికాక్(రూ. 6.75 కోట్లు), దీపక్ హుడా(రూ. 5.75 కోట్లు), మనీష్ పాండే(రూ. 4.60 కోట్లు), కృనాల్ పాండ్య(రూ.8.25కోట్లు), అవేశ్ ఖాన్(రూ.10కోట్లు), అంకిత్ రాజ్‌పుత్(రూ.50లక్షలు)
ఇదీ చూడండి: ఇషాన్ కిషన్@15.25 కోట్లు- ఆ లిస్ట్‌లోకి ఎంట్రీ