ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్​ మెగావేలానికి ముహూర్తం ఫిక్స్​

IPL 2022 Mega auction: బెంగళూరు వేదికగా ఐపీఎల్​ 2022 మెగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.

ఐపీఎల్​ మెగావేలం, IPL 2022 Mega auction
ఐపీఎల్​ మెగావేలం
author img

By

Published : Dec 22, 2021, 7:27 PM IST

IPL 2022 Mega auction: ఐపీఎల్​ 2022 మెగా వేలానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది! బెంగళూరు వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు 7, 8 తేదీల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. కాగా, యూఏఈలో ఈ మెగా ఆక్షన్​ జరుగుతుందని ప్రచారం సాగింది. అయితే కరోనా కారణంగా ఇక్కడే నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.

"కొవిడ్​ పరిస్థితుల వల్ల ఈ మెగా వేలం ప్రక్రియను భారత్​లో నిర్వహిస్తున్నాం. రెండు రోజుల పాటు ఫిబ్రవరి 7,8 తేదీల్లో జరగుతుంది. బెంగళూరులో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి."

-బీసీసీఐ అధికారి.

ఐపీఎల్​ 2022లో ఈ సారి పది జట్లు పాల్గొననున్నాయి. లక్నో, అహ్మాదాబాద్​ టీమ్స్​ కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఈ మెగా వేలం జరగనుంది. కొత్త జట్లు మినహా పాత టీమ్స్​ అన్నీ​ తాము రిటెయిన్​ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఇటీవలే ప్రకటించాయి.

ఇదీ చూడండి: 'మనీహైస్ట్'​ సిరీస్​లో కోహ్లీ.. విరాట్​ ఏం చెప్పాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.