IPL 2022 KKR VS RCB: ముంబయి డీవై పాటిల్ వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. కోల్‌కతా నిర్దేశించిన 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఉమేశ్ యాదవ్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ అనూజ్ రావత్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్(5) పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులకి వచ్చిన విరాట్ కోహ్లీ(12) పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన డేవిడ్ విల్లే(18) కాస్త ఆడినా..సునీల్ నరైన్ తన బంతితో పెవిలియన్‌కు పంపాడు. అహ్మద్(27), రూథర్ఫోర్డు(28) పరుగుల వద్ద ఔటయ్యారు. హర్షల్ పటేల్(10*), దినేశ్ కార్తిక్(14*) మ్యాచ్‌ను ముగించారు. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేశ్ యాదవ్ 2, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు తట్టుకోలేకపోయారు. ఓపెనర్లు అజింక్య రహనే(9), వెంకటేశ్ అయ్యర్(10) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(13) పరుగులు చేసి హసరంగ బంతికి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన నితీశ్ రానా(10), సునీల్ నరైన్(12), సామ్ బిల్లింగ్స్(14) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో కోల్‌కతా సగం ఓవర్లకే సగానికి పైగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక, వికెట్ కీపర్ జాక్స్‌న్(0).. హసరంగ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్(25) తప్ప మిగతా ఆటగాళ్లందరూ నిరాశపరిచారు. ఆఖర్లో వచ్చిన ఉమేశ్ యాదవ్(18) కాస్త ఆడినా.. ఆకాశ్ దీప్ తన బంతితో పెవిలియన్‌కు పంపేశాడు. చివరికి వరుణ్ చక్రవర్తి(10) నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 18.5 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌటయ్యారు. బెంగళూరు బౌలర్లు హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ 1 వికెట్లు తీశారు.
ఇదీ చదవండి: దిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!