ఐపీఎల్ మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు యుజ్వేంద్ర చాహల్. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసుకోవడం ద్వారా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'ను సొంతం చేసుకున్నాడు. చాహల్ ఈ అవార్డును అందుకుంటున్న దృశ్యాన్ని టీవీలో చూసి ఆనందంతో ఎగిరి గంతులేసింది అతడికి కాబోయే సతీమణి ధనశ్రీ. కేరింతలు కొడుతూ చిందులేసింది. ఆరు నెలల తర్వాత అతడు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ అవార్డును అందుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మొగ్గుతున్న దశలో చాహల్ మాయ చేశాడు. 12వ ఓవర్లో మనీష్ పాండే (34)ను ఔట్ చేసి.. మరుసటి ఓవర్లో బెయిర్‌స్టో (61), విజయ్ శంకర్‌లను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో చివరి ఐదు ఓవర్లలో విజయానికి 43 పరుగులు చేయాల్సిన హైదరాబాద్ పేకమేడలా కూలిపోయింది. 32 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను చేజార్చుకుంది. మొత్తంగా పది పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై బెంగళూరు జట్టు విజయం సాధించింది.
ఇదీ చూడండి ఐపీఎల్: రస్సెల్ షాట్‌కు పగిలిపోయిన కెమెరా