ETV Bharat / sports

'రైనా రీఎంట్రీ కోసం ఎదురుచూడట్లేదు'

సురేశ్​ రైనా రీఎంట్రీ కోసం ఎదురుచూడట్లేదని చెప్పిన సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్​.. తర్వాతి మ్యాచుల్లో రాయుడు అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశారు.

Raina
సురేశ్​ రైనా
author img

By

Published : Sep 26, 2020, 4:03 PM IST

ఈ ఐపీఎల్​లో విజయంతో ఆరంభించిన చెన్నై సూపర్​కింగ్స్.. ఆ తర్వాత రాజస్థాన్​, దిల్లీ జట్లపై ఓడింది. దీంతో నిరాశకు గురైన అభిమానులు.. సీజన్​ నుంచి తప్పుకున్న సురేశ్​ రైనా పునరాగమనం చేయాలని కోరుతున్నారు. దీని గురించి మాట్లాడిన జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​.. అది సాధ్యం కాదని చెప్పారు. అతడి కోసం ఎదురుచూడట్లేదని అన్నారు.

"రైనాను తిరిగి రప్పించే విషయం మేం ఆలోచించట్లేదు. వ్యక్తిగత కారణాల వల్ల స్వయంగా అతడే ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఆతడి నిర్ణయాన్ని గౌరవించడం బాధ్యత. ఆట అంటే మంచి, చెడు ఉండటం సహజమే. త్వరలోనే మా జట్టు గాడిలో పడుతుంది. అభిమానుల ముఖాలపై మా ఆటగాళ్లు చిరునవ్వులను తెప్పిస్తారు"

-కాశీ విశ్వనాథన్​, సీఎస్కే సీఈఓ

తొలి మ్యాచులో గాయపడిన అంబటి రాయుడు పూర్తిగా కోలుకున్నాడని.. రాబోయే మ్యాచులకు అందుబాటులో ఉంటాడని కాశీ విశ్వనాథన్ చెప్పారు. అక్టోబరు 2న సన్​రైజర్స్​ హైదరాబాద్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇదీ చూడండి యూఏఈ చేరుకున్న సన్​రైజర్స్​ ఆటగాడు హోల్డర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.