ETV Bharat / sports

సన్​రైజర్స్ విజయం సాధిస్తే 'బుట్టబొమ్మ'కు డ్యాన్స్ చేస్తా

author img

By

Published : Nov 8, 2020, 8:11 PM IST

లాక్​డౌన్ సమయంలో టిక్​టాక్ వీడియోలతో అలరించాడు ఆస్ట్రేలియా క్రికెటర్, సన్​రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఇందులో 'బుట్టబొమ్మ' పాటకు చేసిన డ్యాన్స్​ వైరల్​గా మారింది. దీంతో అభిమానులు మరోసారి ఆ పాటకు డ్యాన్స్ చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. వాటికి స్పందిస్తూ ఐపీఎల్​లో సన్​రైజర్స్ విజయం సాధిస్తే తప్పకుండా 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్ చేస్తానని మాటిచ్చాడు వార్నర్.

Warner promise to fans Will do the Butta Bomma
సన్​రైజర్స్ విజయం సాధిస్తే 'బుట్టబొమ్మ'కు డ్యాన్స్ చేస్తా

తమ జట్టు అభిమానులకు హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మాటిచ్చాడు. ఫైనల్లో విజయం సాధిస్తే మరోసారి 'బుట్ట బొమ్మ' స్టెప్పులతో అందరినీ అలరిస్తానని తెలిపాడు. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబ సమేతంగా వార్నర్‌ తెలుగు పాటలు, డైలాగ్స్‌కు టిక్‌టాక్‌ వీడియోలు చేశాడు. వీటిలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో'ని 'బుట్టబొమ్మ' పాటకు డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో ఎంతో అభిమానించిన ఆ పాటకు మరోసారి డ్యాన్స్ చేస్తానని వార్నర్‌ మాటిచ్చాడు.

"హైదరాబాద్ అభిమానులకు మాటిస్తున్నా. టైటిల్‌ను గెలిస్తే 'బుట్టబొమ్మ' సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తా. ఇక ఇండియా గురించి చెప్పాలంటే.. నాకు రెండో మాతృభూమి లాంటిది. అంతలా అభిమానిస్తున్నా. హైదరాబాద్‌ యాజమాన్యం తరఫున గొప్పగా రాణించడానికి ప్రయత్నిస్తుంటా. ఈ జట్టు నాకు ఎంతో విలువైనది. నాపై నమ్మకాన్ని ఉంచి కెప్టెన్సీ బాధ్యతలు అందివ్వడంతోనే 2016లో జట్టును విజేతగా నిలబెట్టా. నేను లీగ్‌కు దూరమైన సమయంలోనూ జట్టు విజయపథంలో నడిచింది. విలియమ్సన్‌, భువనేశ్వర్‌ జట్టును గొప్పగా నడిపించారు. ఎంతో ప్లానింగ్‌, శ్రమ, సన్నద్ధతకు అది ఉదాహరణ"’

-వార్నర్‌, సన్​రైజర్స్ కెప్టెన్

ఈ సీజన్‌లో వరుస విజయాలతో ప్లేఆఫ్‌కు చేరిన హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసింది. క్వాలిఫయిర్‌-2లో దిల్లీతో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ముంబయితో ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.