ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. మంగళవారం(నవంబరు 10) జరగబోయే ఐపీఎల్ ఫైనల్‌తో ఈ ఘనతలను హిట్‌మ్యాన్ అందుకునే అవకాశముంది.
200వ మ్యాచ్
ఐపీఎల్ అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ(204) అగ్రస్థానంలో ఉన్నాడు. దిల్లీతో జరిగే తుదిపోరు రోహిత్‌కు 200వ మ్యాచ్. దీంతో లీగ్‌లో 200వ మార్క్‌ను దాటిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
3, 4 వేల పరుగులు
ఈ మ్యాచ్‌లో మరో ఎనిమిది పరుగులు చేస్తే ముంబయి ఇండియన్స్ తరఫున నాలుగు వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు రోహిత్. ధోనీ, కోహ్లీ.. తమ జట్ల తరఫున ఈ ఘనతను ఇప్పటికే అందుకున్నారు. 43 పరుగులు చేస్తే ముంబయి తరఫున మూడు వేల పరుగులు పూర్తి చేసిన సారథిగానూ నిలుస్తాడు.
ఐదో టైటిల్
ఈ సీజన్ ముంబయి ఇండియన్స్ విజయం సాధిస్తే.. లీగ్ చరిత్రలోనే ఐదుసార్లు ట్రోఫీని ముద్దాడిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టిస్తాడు. తర్వాతి స్థానంలో మూడు టైటిళ్లతో ధోనీ(చెన్నై) ఉన్నాడు.
ఇదీ చూడండి :