ETV Bharat / sports

కోల్​కతాపై బెంగళూరు ఘన విజయం

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​ను ఓడించింది బెంగళూరు జట్టు. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. 85 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 13.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ జట్టులో బౌలర్లు సిరాజ్​(3), చాహల్​(2) అద్భుతమైన బౌలింగ్​ ప్రదర్శన చేశారు.

rcb beats kolkata
కోల్​కతాపై బెంగళూరు ఘన విజయం
author img

By

Published : Oct 21, 2020, 10:44 PM IST

Updated : Oct 21, 2020, 10:49 PM IST

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోహ్లీసేన మరోసారి అదరగొట్టింది. కోల్​కతా నైట్​ రైడర్స్​ను చిత్తుగా ఓడించి.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 85 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 13.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీసేన విజయంలో బౌలర్​ సిరాజ్​(3), చాహల్​(2), నవదీప్​ సైని, వాషింగ్టన్​ సుందర్​ తలో వికెట్​ తీసి కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోల్​కతా జట్టు.. ఇయాన్ మోర్గాన్ (30; 34 బంతుల్లో, 1ఫోర్​, 1 సిక్సర్​) ఆదుకోవడం వల్ల బెంగళూరుకు కోల్‌కతా 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 84 పరుగులే చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బెంగళూరు బౌలర్లు బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కోల్‌కతాను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. సిరాజ్ (3/8)‌, మోరిస్‌ నిప్పులు చెరిగే బంతులు, చాహల్ (2/15), సుందర్ (1/14) మయాజాలానికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ లొంగిపోయారు. ఆఖర్లో ఫెర్గూసన్‌ (19*; 16 బంతుల్లో, 1ఫోర్​), కుల్‌దీప్‌ యాదవ్ (12; 19 బంతుల్లో, 1ఫోర్​) జాగ్రత్తగా ఆడటం వల్ల కోల్‌కతా ఆలౌట్‌ కాకుండా తప్పించుకుంది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో గిల్‌ (1), త్రిపాఠి (1), రాణా (0), బాంటన్‌ (10), దినేశ్‌ కార్తీక్‌ (4), కమిన్స్‌ (4) పరుగులు చేశారు. మొత్తంగా బెంగళూరు బౌలర్లు నాలుగు ఓవర్లు మెయిడిన్‌ చేశారు.

Last Updated : Oct 21, 2020, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.