ETV Bharat / sports

'ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో స్టోక్స్​ ఒకడు'

author img

By

Published : Oct 31, 2020, 5:30 AM IST

వరుస విజయాలతో దూసుకెళ్తున్న పంజాబ్​ జట్టుకు చెక్​ పెట్టింది రాజస్థాన్​. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్​పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్​ను ప్రశంసలతో ముంచెత్తాడు రాజస్థాన్​ సారథి స్టీవ్​ స్మిత్​. మరోవైపు.. మంచుతో తమ బౌలర్లు ఇబ్బంది పడ్డారని అంటున్నాడు పంజాబ్​ కెప్టన్​ కేఎల్​ రాహుల్​.

'ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో స్టోక్స్​  ఒకడు'
'ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో స్టోక్స్​ ఒకడు'

అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజృంభించింది. 186 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్​ రాయల్స్​​.. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్లే ఆఫ్​ రేసులో నిలిచింది.

రాజస్థాన్​ గెలుపులో బెన్‌ స్టోక్స్‌ (50; 26 బంతుల్లో, 6×4, 3×6) కీలక పాత్ర పోషించాడు. అతడిపై ప్రశంసలు కురిపించాడు ఆ జట్టు​ సారథి స్టీవ్​ స్మిత్​. బట్లర్​ను ఐదో స్థానంలో పంపించడం వల్ల నెట్​ రన్​రేట్​ పెరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు.

"ఈ టోర్నమెట్​లో మేం మునిగాం, తేలాం. గత మ్యాచ్​లో ఆడలేదు గనుక ఈసారి బట్లర్​ను ఐదో స్థానంలో​ పంపించాలి అనుకున్నాం. అది మాకు నెట్ ​రన్​రేట్​ను సాధించడంలో చాలా ఉపయోగపడింది. గత రెండు మ్యాచ్​ల నుంచి స్టోక్స్​ విజృంభిస్తున్నాడు. ప్రపంచంలోని ఉత్తమ ఆటగాళ్లలో స్టోక్స్​ ఒకడు. అతడు మిడిల్​లో ఆడితే బాగా ప్రదర్శిస్తాడని మాకు తెలుసు. రానున్న మ్యాచుల్లోనూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తాం."

--- స్టీవ్​ స్మిత్​, రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​.

బౌండరీకి పంపిస్తే...

రాజస్థాన్​ ఇన్నింగ్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు ఓపెనర్‌ స్టోక్స్‌. 24 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసి, 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​'గా నిలిచాడు. "సిక్స్​లు బాదడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను ముంబయితో అనుసరించిన వ్యూహంతోనే ఈరోజు బరిలోకి దిగాను. కొత్త బంతితో బాగా ఆడాలని అనుకున్నాను. గత మ్యాచ్​ నుంచి మాకు మేము చక్కగా ఆడుతున్నాం. బంతిని బౌండరీకి పంపిస్తే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది" అన్నాడు స్టోక్స్​.

'మంచు ముంచింది'

టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​లోకి దిగిన పంజాబ్​.. నిర్ణీత ఓవర్లలో 185 పరుగులను చేసింది. ఆ జట్టులో క్రిస్‌ గేల్ (99; 63 బంతుల్లో, 6×4, 8×6) విధ్వంసం సృష్టించాడు. అయితే.. సెకండ్​ హాఫ్​లో తమ బౌలర్లను మంచు బాగా ఇబ్బంది పెట్టిందని అంటున్నాడు పంజాబ్​ సారథి కేఎల్​ రాహుల్​. అయినప్పటికీ తాము బాగానే బౌలింగ్​ చేశామని చెప్పాడు.

"టాస్​ ఓడిపోవడం మాకు పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. మేము తర్వాత బ్యాటింగ్ చేస్తే చాలా సులువుగా ఉండేది. సెకండ్​ హాఫ్​లో మంచు బాగా ఇబ్బంది పెట్టింది. బంతిపై పట్టు సాధించడం బౌలర్లకు క్లిష్టంగా మారింది. మేము బాగా బౌలింగ్​ చేయలేదని కాదు. కానీ, తడి బంతిపై ఇంకా సాధన చేయాల్సి ఉంది. ఈ సీజన్​లో ఊహించనంతగా మంచు కురుస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్న గేల్​ అదరగొట్టాడు. సీజన్​లో ఏదీ సులువుగా రాదు."

--- కేఎల్ రాహుల్​, కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​​.

ఈ విజయంతో రాజస్థాన్‌ 12 పాయింట్లతో అయిదో స్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్​ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

ఇదీ చూడండి:పంజాబ్‌కు రాజస్థాన్‌ పంచ్‌- ప్లేఆఫ్‌ ఆశలు సజీవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.