దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ విఫలమై ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఈ మ్యాచ్ మిడిల్ ఓవర్లలో మంచి ప్రదర్శనే చేసినా.. తర్వాత మ్యాచ్‌పై పట్టుకోల్పోయామని అన్నాడు బెంగళూరు సారథి కోహ్లీ.
"మ్యాచ్ తొలి ఆరు ఓవర్లు ప్రత్యర్థి చేతుల్లో ఉంది. ఆ తర్వాత మావైపు వచ్చినట్లు అనిపించింది. అయితే, దిల్లీ మళ్లీ పుంజుకుని మ్యాచ్‌పై పట్టు సంపాదించింది. వాళ్ల బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, పృథ్వీషా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్లను పెవిలియన్‌కు పంపించాలని మేమెంతో ప్రయత్నించాం. కానీ.. వాళ్లు ఔటయ్యే సమయానికి చేయాల్సిన నష్టం చేశారు. దీనికి తోడు స్టోయినిస్ మా గెలుపు అవకాశాలను దెబ్బతీశాడు. అతనికి ఒకసారి లైఫ్ ఇచ్చాం. అదే మాకు నష్టం కలిగించింది. బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాం. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం."
-కోహ్లీ, ఆర్సీబీ సారథి
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రేయస్ సారథ్యంలోని దిల్లీలో స్టోయినిస్ 53, పృథ్వీ షా 42, రిషభ్ పంత్ 37 బ్యాటుతో మెరుపులు మెరిపించారు. దీంతో ప్రత్యర్థి బెంగళూరు ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది దిల్లీ. ఛేదనకు దిగిన బెంగళూరుకు రబాడ (4/24), అక్షర్ పటేల్ (2/18) ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దిల్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరుకు 59 పరుగుల భారీ ఓటమి తప్పలేదు.