ETV Bharat / sports

కోల్​కతా బౌలర్ సునీల్ నరైన్​కు ఊరట - KKR VS SRH

కోల్​కతా జట్టు స్పిన్నర్​ నరైన్​కు​ ఊరటనిచ్చే అంశం. తనపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన కమిటీ.. బౌలింగ్ సక్రమంగానే ఉందని తేల్చింది. జాబితా నుంచి నరైన్ పేరును తొలగించింది.

Narine cleared by IPL suspect bowling action committee
సునీల్ నరైన్
author img

By

Published : Oct 18, 2020, 2:15 PM IST

ఐపీఎల్​లో సునీల్​ నరైన్​ను అనుమానాస్పద బౌలింగ్ జాబితా నుంచి తొలగించారు. అతడిపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఐపీఎల్ కమిటీ.. ఈ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది.

అబుదాబిలో అక్టోబరు 10న పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో నరైన్ బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు.. ఐపీఎల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఓవర్​కు సంబంధించిన వీడియో ఫుటేజీని కమిటీకి పంపించింది కోల్​కతా ఫ్రాంచైజీ. దానిని ఆసాంతం పరిశీలించి, నరైన్​ బౌలింగ్​లో అనుమానం ఏం లేదని తేల్చారు. ఫలితంగా సీజన్​లోని తర్వాత మ్యాచ్​ల్లో ఆడనున్నాడీ బౌలర్. 2014లోనూ ఇదే తరహాలో నిషేధానికి గురై కొన్నాళ్ల పాటు క్రికెట్​కు దూరమయ్యాడు నరైన్.

sunil narine
కోల్​కతా బౌలర్ సునీల్ నరైన్

ప్రస్తుతం ఐపీఎల్​లో నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్న కోల్​కతా.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అబుదాబిలో ఆదివారం(అక్టోబరు 18) మధ్యాహ్నం జరిగే మ్యాచ్​లో హైదరాబాద్​తో తలపడనుంది.

ఇది చదవండి: కోల్​కతాXహైదరాబాద్​: విజయమే లక్ష్యంగా బరిలోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.