ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న ఇద్దరు క్రికెటర్ల కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ ఆటగాడు మన్‌దీప్ సింగ్ తండ్రి శనివారం ఉదయం మృతి చెందగా.. స్వదేశానికి వచ్చే వీలు లేక అతను అక్కడే ఉండిపోయాడు. తండ్రి మరణాన్ని దిగమింగి సాయంత్రం అతను సన్‌రైజర్స్‌తో మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్ 17 పరుగులు చేశాడు. అతడికి సంఘీభావంగా పంజాబ్ ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించారు.
బాధలో ఉన్నా.. టాప్ స్కోరర్‌గా
మధ్యాహ్నం దిల్లీతో మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన నితీశ్ రాణా కుటుంబంలోనూ ముందు రోజు విషాదం చోటుచేసుకుంది. అతడి మావయ్య సురేందర్ మరణించాడు. ఈ బాధలోనే మ్యాచ్ ఆడిన రాణా.. చక్కటి ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించాడు. అర్ధశతకం అయ్యాక సురేందర్ పేరుతో ఉన్న జెర్సీని చూపిస్తూ తన ఇన్నింగ్స్‌ను మావయ్యకు అంకితమిచ్చాడు.
ఇదీ చదవండి:'ఈ ఓటమి మర్చిపోయి.. ముందుకెళ్తాం'