ETV Bharat / sports

ఐపీఎల్: గెలిస్తే ఫ్లే ఆఫ్స్​కు ముంబయి.. పంజాబ్ ఇంటికి! - IPL 2020 UAE

గత మ్యాచ్​ల్లో గెలిచి జోరుమీదున్న ఉన్న ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య నేడు దుబాయ్ వేదికగా మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

Rampaging MI up against Gayle-inspired KXIP
ముంబయి పంజాబ్
author img

By

Published : Oct 18, 2020, 9:09 AM IST

పాయింట్ల పట్టికలో తొలి, చివరి స్థానాల్లో ఉన్న జట్ల మధ్య నేడు (ఆదివారం) మ్యాచ్​ జరగనుంది. ముంబయి ఇండియన్స్​తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్​లో గెలిస్తే రోహిత్ బృందం ఫ్లే ఆఫ్​లో చోటు ఖరారు చేసుకున్న మొదటి జట్టుగా నిలుస్తుంది. పంజాబ్ ఓడితే రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అప్రతిష్ఠ మూట గట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇరుజట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

MI VS KXIP MATCH
ముంబయి-పంజాబ్ మ్యాచ్​లోని దృశ్యం

ముంబయి ఇండియన్స్

సమష్టి కృషితో వరుసగా ఐదు విజయాలు నమోదు చేసిన ముంబయి.. అదే దూకుడు కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(251 పరుగులు), డికాక్(269)​తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్​మన్ సూర్యకుమార్​(243), ఇషాన్ కిషన్(186) ఫుల్ ఫామ్​లో ఉన్నారు.

బౌలింగ్​లో బుమ్రా, బౌల్ట్.. ఈ సీజన్​లో విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి 8 మ్యాచ్​ల్లో 12 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్​ రాహుల్ చాహర్​ కూడా గత మ్యాచ్​లో రెండు వికెట్లు తీసి ఫామ్​లోకి వచ్చినట్లు కనిపించాడు.

MI VS KXIP MATCH
ముంబయి ఇండియన్స్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఈ సీజన్​లో ఎక్కువ పరుగులు చేసిన వారిలో పంజాబ్ జట్టులోని కేఎల్ రాహుల్(387), మయాంక్ అగర్వాల్(337) ముందున్నారు. అయినా మిగిలిన వారి నుంచి సహకారం లేకపోవడం, అదృష్టం కలిసి రాకపోవడం వల్ల మ్యాచ్​లు ఓడిపోతున్నారు. గత మ్యాచ్​లో బరిలోకి దిగిన గేల్.. తన బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్నందించాడు.

అయితే ఇప్పటికే ఫ్లే ఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న పంజాబ్​కు, ఈ మ్యాచ్​లో గెలుపు చాలా కీలకం. బౌలింగ్​లోనూ షమీ, రవి బిష్ణోయ్ మినహా మిగిలిన వారందరూ సరిగా ఆడలేకపోతున్నారు. దీంతో పంజాబ్ మ్యాచ్​లు ఓడిపోవాల్సి వస్తోంది.

MI VS KXIP MATCH
కింగ్స్ ఎలెవన్ పంజాబ్

జట్లు(అంచనా)

ముంబయి: రోహిత్ శర్మ(కెప్టెన్), డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, పొలార్డ్, కృనాల్ పాండ్యా, కౌల్టర్​ నీల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

పంజాబ్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్​వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.