ETV Bharat / sports

ధోనీ బ్యాటింగ్ ఆర్డర్​పై కోచ్ విచిత్ర సమాధానం - ఐపీఎల్ 2020 వార్తలు

బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ దిగువన రావడంపై క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై చెన్నై కోచ్ ఫ్లెమింగ్​ను ప్రశ్నించగా.. అతడు విచిత్రమైన సమాధానం చెప్పాడు.

IPL 2020: Fleming says Kedar Jadhav is CSK's number four
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్​పై కోచ్ విచిత్ర సమాధానం
author img

By

Published : Oct 3, 2020, 6:04 PM IST

బ్యాటింగ్‌ ఆర్డర్లో ఎంఎస్ ధోనీ మరీ దిగువన రావడంపై ప్రశ్నించిన విలేకరులపై చెన్నై జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'నిజంగా.. ఇది అంత ముఖ్యమైన ప్రశ్నా?' అని చిరాకు పడ్డాడు. మళ్లీ కాసేపటికి తమ జట్టులో నాలుగో స్థానాన్ని కేదార్‌ జాదవ్‌కు కేటాయించామని వివరించాడు. హైదరాబాద్‌ చేతిలో ఓటమి తర్వాత ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మీడియాతో మాట్లాడాడు.

"ఎంఎస్‌ ధోనీ కన్నా ముందుగా కేదార్‌ జాదవ్‌ను పంపించడంలో తర్కం ఏమిటి?" అని ఒక విలేకరి ఫ్లెమింగ్​ను ప్రశ్నించాడు. అప్పుడతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. "నిజంగానా? నేను అడుగుతున్నా. నిజంగానే అది అంత ముఖ్యమైన ప్రశ్నా?" అని చిరాకుపడ్డాడు.

IPL 2020: Fleming says Kedar Jadhav is CSK's number four
ధోనీ గణాంకాలు

"మా బ్యాటింగ్‌ ఆర్డర్లో జాదవ్‌ది నాలుగో స్థానం. ప్రాథమికంగా ధోనీ మిడిల్‌ నుంచి లోయర్‌ ఆర్డర్ ఆటగాడు. ఇక్కడ జాదవ్‌ రెండు పాత్రలు పోషిస్తాడు. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ రాణిస్తే జాదవ్‌ దిగువకు వచ్చి ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు వస్తాడు. అదే త్వరగా వికెట్లు పడ్డాయనుకోండి జాదవ్‌ నాలుగులో వచ్చి వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు. ధోనీ దిగువన వస్తాడు. ఇక్కడితో నేను ఆపేస్తాను" అని ఫ్లెమింగ్‌ విచిత్రమైన తర్కాన్ని వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.