ETV Bharat / sports

ఐపీఎల్2020: సీఎస్కేకు యూఏఈ పిచ్​లు కలిసొస్తాయా! - చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ 2020

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్​తో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈసారి కరోనా కారణంగా లీగ్ యూఏఈలో నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడి పిచ్​లు జట్లపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టుకు అక్కడి పిచ్​లపై గణాంకాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

IPL 2020
ఐపీఎల్2020
author img

By

Published : Sep 19, 2020, 1:51 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

చెన్నై సూపర్ కింగ్స్.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోనీ. అభిమానుల్ని అంతగా ప్రభావితం చేశాడు మహీ. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇతడు ఐపీఎల్​తో మళ్లీ బ్యాట్ పట్టబోతున్నాడు. కానీ కరోనా కారణంగా ఈ ఏడాది లీగ్ యూఏఈ వేదికగా జరగనుంది. అయితే స్వదేశంలోనే కాక అక్కడి పిచ్​లపైనా సీఎస్కేకు మంచి రికార్డుంది. అక్కడ ఆడిన 5 మ్యాచ్​ల్లో నాలుగింటిలో గెలిచింది. మొత్తంగా ఐదు మ్యాచ్​లలో దుబాయ్, అబుదాబిల్లో రెండు చొప్పున మ్యాచ్​లు జరగగా, షార్జాలో ఒకటి జరిగింది. ఈ ఏడాది లీగ్​ కూడా అక్కడే జరగనుండటం వల్ల ఇప్పుడు అందరి దృష్టి చెన్నైపైనే ఉంది. మరి యూఏఈ పిచ్​లపై సీఎస్కే గణాంకాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా!

IPL 2020
ధోనీ
  • చెన్నై ఆటగాళ్లలో డ్వేన్ స్మిత్ అక్కడి పిచ్​లపై మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఇదే ఈ జట్టు తరఫున అత్యధికం.
  • చెన్నై ఆటగాళ్లు అక్కడి పిచ్​లపై మొత్తం ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశారు.
  • యూఏఈ గడ్డపై సురేశ్ రైనా దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మూడు క్యాచ్​లు పట్టాడు. సీఎస్కేకు ఓ మ్యాచ్​లో ఇవే ఎక్కువ క్యాచ్​లు. అలాగే ఈ జట్టు తరఫున మొత్తం ఐదు క్యాచ్​లతో అందరి కంటే ఎక్కువ క్యాచ్​లు పట్టిన ఆటగాడిగా ఉన్నాడు రైనా.
    IPL 2020
    రైనా
  • ఈ జట్టు తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మోహిత్ శర్మ పేరు మీద ఉంది. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో ఇతడు 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అలాగే మొత్తం ఎనిమిది వికెట్లతో ఈ జట్టు తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు.
  • డ్వేన్ స్మిత్ స్మిత్ ఇక్కడ 15 సిక్సులు బాదాడు. చెన్నై జట్టు తరఫున ఓ ఆటగాడి అత్యధిక సిక్సులు ఇవే.
  • యూఏఈలో మొత్తం చెన్నై జట్టు 33 సిక్సులు బాదింది.
  • అక్కడ చెన్నై తరఫున అత్యధిక స్కోరు బ్రెండన్ మెక్​కలమ్ పేరిట ఉంది. ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో 71 పరుగులు చేశాడు.
  • రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అక్కడ ఈ జట్టు అత్యల్పం ఇదే.
  • కింగ్స్ ఎలెవన్ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది చెన్నై. అక్కడ ఈ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు.
  • యూఏఈలో చెన్నై జట్టు తరఫున డ్వేన్ స్మిత్ 240 పరుగులు చేశాడు. అక్కడ ఈ జట్టు తరఫున అత్యధిక పరుగుల వీరుడు ఇతడే.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.