గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ వీరుడు క్రిస్ గేల్ అద్భుత ప్రదర్శన చేశాడు. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేయడం వల్ల ఒత్తిడి అనిపించిందా అని మ్యాచ్ అనంతరం గేల్‌ను అడగ్గా అలాంటిదేమీ లేదని చెప్పాడు. తాను యూనివర్స్ బాస్ అని, తానెందుకు అలా అవుతానని ఎదురు ప్రశ్నించాడు.
మెరిసిన గేల్ ,రాహుల్ :
గురువారం జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(61*; 49 బంతుల్లో 1x4, 5x6), క్రిస్ గేల్(53; 45 బంతుల్లో 1x4, 5x6) అర్ధశతకాలతో అలరించారు. అంతకుముందు మయాంక్ అగర్వాల్ (45; 25 బంతుల్లో 4x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, చాలా రోజుల తర్వాత బరిలోకి దిగిన యూనివర్స్ బాస్ రాగానే సిక్సర్లతో మెరిశాడు. దీంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఇన్ని రోజులు పంజాబ్ అతడిని ఎందుకు ఆడించలేదని ప్రశ్నిస్తున్నారు. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేయడం వల్ల ఒత్తిడి అనిపించిందా అని మ్యాచ్ అనంతరం క్రిస్ గేల్‌ను అడగ్గా అలాంటిదేమీ లేదని చెప్పాడు. తాను యూనివర్స్ బాస్ అని, తానెందుకు అలా అవుతానని ఎదురు ప్రశ్నించాడు.
'ఒత్తిడి ఏం లేదు'
"నేనేం ఒత్తిడికి గురవ్వలేదు. నేను యూనివర్స్ బాస్. అలా ఎలా అనుకుంటారు? నేను గుండెపోటు తెప్పించగలను. ఇటీవల క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే, ఇప్పుడు బాగా ఆడడం వల్ల సంతోషంగా ఉంది. ఈ ప్రదర్శనతో 2021 సీజన్‌కు కూడా సిద్ధంగా ఉండాలని భావిస్తున్నా. సెకండ్ ఇన్నింగ్స్‌లో పరుగులు చేయొచ్చని అనుకున్నా. ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందే. దాన్ని మేం సద్వినియోగం చేసుకున్నాం. ఈ మ్యాచ్‌లో జట్టు యాజమాన్యం నన్ను ఆడించాలని అనుకుంది. నా పని నేను పూర్తిచేశా. ఇక ఈ సీజన్‌లో మా ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నారు. అందుకే వాళ్లని అలాగే ఆడించాం. అయితే, ఈ విజయం మా జట్టుకు ఎంతో అవసరం. నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం ముఖ్యమని అనుకున్నా. రిజర్వ్ బెంచ్‌కు పరిమితమవ్వడం ఇష్టం ఉండదు. కానీ ఆ స్థానాన్ని ఆస్వాదించా. అనారోగ్యానికి గురవ్వడం తప్పితే ఫిట్‌నెస్ విషయంలో మెరుగవుతున్నా" అని గేల్ వివరించాడు.