ETV Bharat / sports

'అశ్విన్​ ఆడాలంటే ఫిజియో అనుమతి కావాలి'

దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ ప్రస్తుతం బాగానే ఉన్నాడని అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్​ అయ్యర్​. తర్వాతి మ్యాచ్​కు అందుబాటులో ఉంటానని అశ్విన్​ చెప్పినట్లు వెల్లడించాడు. అయితే ఈ విషయంలో జట్టు ఫిజియోదే తుది నిర్ణయమని స్పష్టం చేశాడు.

DC VS KXIP: Physio will take final call on Ashwin's availability, says Iyer
ఐపీఎల్​: 'అశ్విన్​ ఆడాలంటే ఫిజియో అనుమతి కావాలి'
author img

By

Published : Sep 21, 2020, 10:46 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఐపీఎల్​లో ఆదివారం కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్-దిల్లీ క్యాపిటల్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో దిల్లీ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్ గాయపడ్డాడు. లాంగాన్​ వైపు వెళ్లే బంతిని ఆపే క్రమంలో కిందపడటం వల్ల తన ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే అశ్విన్​ మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలో చెన్నైతో జరిగే తర్వాతి మ్యాచ్​లో అశ్విన్​ ​ఆడటం కష్టమే అనిపిస్తోంది. దీనిపై స్పందించిన దిల్లీ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​.. అశ్విన్​ తర్వాతి మ్యాచ్​కు అందుబాటులో ఉంటాడని​ తెలిపాడు. అయితే ఆ మ్యాచ్​లో అశ్విన్ ఆడేది, లేనిది జట్టు ఫిజియో పాట్రిక్​ తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆరో ఓవర్​ వేసిన రవిచంద్రన్​ అశ్విన్​ కేవలం రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఓవర్ చివరి బంతికి మ్యాక్స్​వెల్​ కొట్టిన సింగిల్​ను కాపాడటానికి డైవ్​ చేశాడు అశ్విన్​. అపుడు అతడి ఎడమ చేయి నేరుగా నేలను తాకగా.. శరీర బరువంతా దానిపై పడింది. వెంటనే అశ్విన్‌ చేయి పట్టుకుని బాధతో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి అతణ్ని బయటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్​ రూమ్​లో భుజంపై ఐస్​ ప్యాక్​తో కనిపించాడు అశ్విన్​. అతడి భుజం స్థానభ్రంశం చెందినట్లుగా అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అశ్విన్‌ ఈ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైనట్లేనని పలువురు క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

DC VS KXIP: Physio will take final call on Ashwin's availability, says Iyer
రవిచంద్రన్​ అశ్విన్

ఆటను మార్చేశాడు

మ్యాచ్​ ముగిసిన అనంతరం దిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​ మాట్లాడుతూ.. "అశ్విన్​ తను వేసిన ఓవర్​తో దాదాపుగా ఆటనే మార్చేశాడు. ప్రస్తుతం అతడు మామూలుగానే ఉన్నాడు. తర్వాతి మ్యాచ్​కు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అయితే ఈ విషయంలో మాత్రం ఫిజియోదే తుది నిర్ణయం. అశ్విన్​ ఆడితే అతడి రూపంలో మరో స్పిన్నర్​ ఉండటం జట్టుకు మంచిదే" అని అన్నాడు.

సెప్టెంబరు 25న దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్​కింగ్స్​తో దిల్లీ క్యాపిటల్స్​ తలపడనుంది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.