ETV Bharat / sports

సత్తా చాటే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు: ధోనీ

author img

By

Published : Oct 30, 2020, 5:12 AM IST

Updated : Oct 30, 2020, 8:45 AM IST

గురువారం జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్ ​రైడర్స్​పై 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది చెన్నై సూపర్​ కింగ్స్​. సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్ గైక్వాడ్​పై ప్రశంసలు కురిపించాడు సారథి ధోనీ. ప్రస్తుతం అత్యంత ప్రతిభ ఉన్న ఆటగాళ్లలో రుతురాజ్ ఒకడని చెప్పాడు. నిలకడలేని ప్రదర్శనతో మరో ఓటమిని మూటగట్టుకుంది కోల్​కతా జట్టు. అయితే.. ఈ మ్యాచ్​లో తాము బాగానే ఆడామని అన్నాడు ఆ జట్టు కెప్టెన్​ మోర్గాన్​.

chennai super kings won against kolkatha night riders and dhoni shared his opinion about the match
తర్వాతి సీజన్​లో మేం అదరగొడతాం:ధోనీ

దుబాయ్​ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్​లో చెన్నై తమ సత్తాను చాటుకుంది. 173 లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై సూపర్​కింగ్స్​.. కోల్​కతా నైట్ ​రైడర్స్​పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.

చెన్నై గెలుపులో ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ (72) కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో జడేజా (31) ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మ్యాచ్​ క్లైమాక్స్​లో తమకు అనుకూలంగా నిలిచిన గేమ్​ ఇదేనని అంటున్నాడు చెన్నై సారథి ధోని. తర్వాతి సీజన్​లో అద్భుతంగా రాణించడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. రుతురాజ్ గైక్వాడ్​పై ప్రశంసలు కురిపించాడు

"మ్యాచ్​ చివరి దశలో మాకు అనుకూలంగా నిలిచిన గేమ్​ ఇదే అనుకుంటున్నాను. ఈ ఘనత జట్టు సభ్యులకే చెందుతుంది. ఈ సీజన్​లో జడేజా అద్భుతంగా రాణిస్తున్నాడు. రుతురాజ్​ తానేంటో నిరూపించుకున్నాడు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడ్డాడు. ప్రస్తుతం అత్యంత ప్రతిభ ఉన్న ఆటగాళ్లలో రుతురాజ్ ఒకడు.

టోర్నీలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండడం చాలా అవసరం. ఉత్తమ ప్రదర్శన కనబర్చడం మాకు అత్యవసరం. మరో దశకు చేరుకునేందుకు మాకు అవకాశం లేదు. కానీ, తర్వాతి సీజన్​లో సత్తా చాటగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు."

-- మహేంద్ర సింగ్​ ధోనీ, చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​.

చిరునవ్వుతో..

మ్యాచ్​ గెలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నాడు రుతురాజ్​ గైక్వాడ్​. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత తాను ఆడటానికి పరిస్థితులు క్లిష్టంగానే ఉంటాయని భావించానన్నాడు. తమ సారథి ధోని సూచించినట్లు ప్రతి పరిస్థితిని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నానని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తు గురించి అనవసర ఆందోళన చెందనని చెప్పాడు.

బంతిని బాదడంపైనే..

చివరి ఓవర్లో చెన్నైకి 10 పరుగులు అవసరం. క్రీజులో ఉన్న జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాది.. జట్టును విజయతీరాలకు చేర్చాడు. 'చివరి 12 బంతులు మిగిలి ఉన్నప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు. బంతిని బాదడంపైనే దృష్టిని కేంద్రీకరించాను' అని అన్నాడు జడేజా.

'తర్వాతి మ్యాచ్​లో చూపిస్తాం'

అయితే.. తాము ఈ మ్యాచ్​లో చక్కగానే ఆడామని అంటన్నాడు కోల్​కతా కెప్టెన్​ మోర్గాన్​. ఈ ఓటమిని మర్చిపోయి.. రానున్న గేమ్​లో రాణిస్తామని చెబుతున్నాడు.

"మేము చాలా బాగా ఆడామనే నేను అనుకుంటున్నాను. టాస్​ ఓడిపోవడం మినహా మరేమీ లేదు. 8వ ఓవర్​ నుంచి మాకు ఛాలెంజింగ్​గా మారింది. గాలిలో తేమ శాతం పెరిగిపోయింది. మా బ్యాటింగ్​ పద్ధతిలో మేము మెరుగయ్యాం. మా బౌలర్లు బాగా రాణించారు. ఈ ఓటమికి నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. దీని గురించి అతిగా ఆలోచించడం మానేసి, రానున్న గేమ్​లో చక్కాగా ఆడుతాం."

--మోర్గాన్​, కోల్​కతా కోల్​కతా నైట్ ​రైడర్స్ కెప్టెన్​.

టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​లోకి దిగిన కోల్​కతా.. నిర్ణీత ఓవర్లలో 172 పరుగులను చేసింది. కాగా.. చెన్నై ఐదో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

ఇదీ చూడండి:రుతురాజ్​ భళా.. చెన్నై సూపర్​కింగ్స్​దే విజయం

Last Updated : Oct 30, 2020, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.