ETV Bharat / sports

బేబీ.. నేనెంతో గర్వపడుతున్నా: ఇషాన్ ప్రేయసి!

author img

By

Published : Sep 29, 2020, 3:06 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. దీంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతడి ప్రేయసిగా భావిస్తోన్న మోడల్ అదితి హుండియా కూడా ఇషాన్​ను అభినందించింది.

Aditi calls Ishan Kishan as baby
బేబీ.. నేనేంతో గర్వపడుతున్నా: ఇషాన్ ప్రేయసి!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మన్ ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2×4, 9×6) అద్భుత ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. దీంతో ఇతడిని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు మాజీలు, ప్రముఖులు, సహ ఆటగాళ్లు. పొలార్డ్‌తో కలిసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యానికి ముగ్ధులు అవుతున్నారు.

అయితే కిషన్​ ప్రేయసి అంటూ భావిస్తోన్న మోడల్, మిస్ ఇండియా-2017 పోటీల్లో పాల్గొన్న అదితి హుండియా కూడా ఇతడి ప్రదర్శనను మెచ్చుకుంది. బేబీ అంటూ సంబోధించింది. 'నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నా' అంటూ ఇన్​స్టాగ్రామ్ స్టోరీస్​లో రాసుకొచ్చింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య రిలేషన్​షిప్​పై అనుమానాలు నెలకొన్నాయి.

Aditi calls Ishan Kishan as baby
పొలార్డ్​తో ఇషాన్

ఎవరీ అదితి?

అదితి.. ముంబయి జట్టుకి ఫ్యాన్‌గర్ల్‌! గతంలోనూ వాంఖడేలో ఆ జట్టుకు మద్దతుగా నిలిచింది. చాలాకాలంగా ఆమె ఇషాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చనువుగా దిగిన చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్‌ అయ్యాయి. మిస్‌ రాజస్థాన్‌గా ఎంపికైన అదితి 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో భాగమైంది. మిస్‌ దివా 2018లో 'మిస్‌ దివా సుప్రానేషనల్‌'గా గెలిచింది. పొలాండ్‌లో జరిగిన మిస్‌ సుప్రానేషనల్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.