సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడుతున్న వార్నర్ 81 పరుగులతో రాణించాడు.
టాస్ గెలిచిన పంజాబ్ హైదరాబాద్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్, సాహా రెచ్చిపోయి ఆడారు. 4 ఓవర్లలోనే వీరిద్దరూ కలిసి 50 పరుగులు చేశారు. ఈ సీజన్లో 77 పరుగులతో అత్యధిక పవర్ ప్లే స్కోరు నమోదు చేశారు. ఆ వెంటనే 28 పరుగులు చేసిన సాహా ఔటయ్యాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
81 runs by David Warner as the @SunRisers post a formidable total of 212/6 on board. Will #KXIP chase this down?#SRHvKXIP pic.twitter.com/J2PwCFQgMc
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 29, 2019
81 runs by David Warner as the @SunRisers post a formidable total of 212/6 on board. Will #KXIP chase this down?#SRHvKXIP pic.twitter.com/J2PwCFQgMcInnings Break!
— IndianPremierLeague (@IPL) April 29, 2019
81 runs by David Warner as the @SunRisers post a formidable total of 212/6 on board. Will #KXIP chase this down?#SRHvKXIP pic.twitter.com/J2PwCFQgMc
రెచ్చిపోయిన వార్నర్..
వన్ డౌన్లో వచ్చిన మనీశ్ పాండే సహకారంతో వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలోనే మరో అర్ధసెంచరీ చేశాడు. జట్టు స్కోరు 160 వద్ద మనీశ్ పాండే 36 పరుగులు చేసి ఔటయ్యాడు. కొద్ది సేపటికే 81 పరుగులు చేసిన వార్నర్.. అశ్విన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో నబీ 20, విలియమ్సన్ 14, రషీద్ ఖాన్ 1, విజయ్ శంకర్ 7, అభిషేక్ 5 పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమి తలో రెండు వికెట్లు తీశారు. మురుగన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు.