ఆదివారం చెన్నైతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. నాలుగోసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది. సారథి రోహిత్ శర్మ.. ముంబయిని విజేతగా నిలిపి ఐపీఎల్లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంకో ఆశ్చర్యకర విషయం.... ఈ టోర్నీలో ఆడినా ఏ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓటమి అనేదే లేదు రోహిత్ శర్మకు.
2008లో ప్రారంభమైన ఈ పొట్టి లీగ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాడు రోహిత్. ఆ సీజన్లో ఆ జట్టు తరఫున అత్యధికంగా 404 పరుగులు చేశాడు. తర్వాతి ఏడాది వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందాడు. అదే సంవత్సరం జోహెన్స్‌బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో గెలిచి కప్పు సాధించిందీ జట్టు.
ఒక సంవత్సరం తర్వాత ముంబయి ఇండియన్స్ వేలంలో అతడిని దక్కించుకుంది. 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్‌ను తప్పించి రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. సారథిగా తొలి సీజన్లో విజయవంతమై జట్టును విజేతగా నిలిపాడు. తర్వాత 2015, 2017, 2019లో ముంబయిని విజయపథంలో నడిపించాడు.
ఇది చదవండి: నరాలు తెగే ఉత్కంఠలో.. నాలుగో టైటిల్ నెగ్గిన ముంబయి