ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి తన బ్యాటు పవర్ చూపించాడు ధోని. ఆదివారం ఐపీఎల్లో బెంగళూరుతో మ్యాచ్‌లో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడింది చెన్నై. అనంతరం సామాజిక మాధ్యమాల్లో విభిన్నంగా స్పందించారు నెటిజన్లు. మహేంద్ర సింగ్ ధోనిని దేశానికి ప్రధాన మంత్రిని చేసేద్దాం అంటూ సరదాగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ అతడు ఎన్నికల్లో పోటీ చేస్తే నా ఓటు ధోనికే అని చెపుతున్నారు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని.. చివరి వరకు పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కానీ అభిమానుల మనసును గెలుచుకున్నాడు.
ఇది చదవండి: ధోనిని చూసి కోహ్లీ ఎందుకు భయపడ్డాడో తెలుసా?