ETV Bharat / sports

ఈడెన్​లో బౌండరీల వర్షం... కోల్​కతాదే విజయం

author img

By

Published : Apr 29, 2019, 12:34 AM IST

ఈడెన్​ వేదికగా ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా 34 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కోల్​కతా నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 198 రన్స్​కే పరిమితమైంది ముంబయి జట్టు.

ఈడెన్​లో బౌండరీల వర్షం...కోల్​కతాదే విజయం

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో 34 పరుగుల తేడాతో విజయం సాధించింది కోల్​కతా నైట్​రైడర్స్​. కోల్​కతా నిర్దేశించిన 233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో... ఆరంభంలోనే తడబడింది రోహిత్​ సేన. ముంబయిని ఓడించి ఐపీఎల్​లో మొత్తం 100 విజయాలు ఖాతాలో వేసుకుంది కోల్​కతా జట్టు. బ్యాట్​తో పాటు బంతితోనూ రాణించిన రసెల్​కు మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు​ లభించింది.

ముంబయి బ్యాట్స్​మెన్​​ క్యూ...

ఓపెనర్లు డికాక్​(0), రోహిత్​ (12), లూయిస్​​(15), సూర్యకుమార్​(26), పొలార్డ్​(20) తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో సాధించాల్సిన రన్​రేట్​ బాగా పెరిగిపోయి...మిడిలార్డర్​ బ్యాట్స్​మెన్లపై ఒత్తిడి ఎక్కువైంది.

హర్దిక్​ సంచలన ఇన్నింగ్స్​...

58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో ముంబయి 198 పరుగులు చేసిందంటే హర్దిక్​ ఇన్నింగ్సే కారణం. 34 బంతుల్లో 91 పరుగులు(6 ఫోర్లు, 9 సిక్సులు)చేసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విజయాన్ని అందించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కాని భారీ లక్ష్యం కావడం మిగతా బ్యాట్స్​మెన్ల నుంచి సరైన సహాకారం లేక విజయాన్ని అందుకోలేకపోయింది ముంబయి.

కోల్​కతా బౌలర్లలో నరైన్​, గుర్నే, రసెల్​ రెండు వికెట్లు తీయగా...పియూష్​ చావ్లా ఒక వికెట్​ సాధించాడు.

The @KKRiders win by 34 runs and register their 100th Victory in IPL 👌👌 pic.twitter.com/zAl5lMBW8O

— IndianPremierLeague (@IPL) April 28, 2019

కోల్​కతాకు బ్యాట్స్​మెన్ల రక్ష...

ప్లేఆఫ్​ రేసులో నిలవాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్​లో కోల్​కతా బ్యాట్స్​మెన్లు​ బౌండరీలే హద్దుగా చెలరేగారు. 20 ఓవర్లలో 232 పరుగుల భారీ స్కోరు​ సాధించారు. దీనికి కారణం ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్రిస్​లిన్​, శుభ్​మన్​ గిల్​ మంచి ఆరంభం అందించారు. క్రిస్‌లిన్‌ (54; 28 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు), శుభ్‌మన్‌గిల్‌ (76; 45 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సులు) అర్ధ శతకాలతో రాణించారు.

రసెల్​ రెచ్చిపోతే...

ఆండ్రీ రసెల్‌(80; 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సులు) విజృంభణతో ముంబయి బౌలర్లు తేలిపోయారు. చాహర్​, హర్దిక్​ పాండ్య తలో వికెట్​ తీశారు. కృనాల్​ తప్ప ఒక్కో బౌలర్​ 10 రన్​రేట్​తో పరుగులు సమర్పించుకున్నారు.

AP Video Delivery Log - 1700 GMT News
Sunday, 28 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1653: Mexico Migrants AP Clients Only 4208222
Global migrants’ journey stalls in southern Mexico
AP-APTN-1643: ARCHIVE US Lugar AP Clients Only 4208220
Former US Sen. Lugar, foreign policy expert, dies
AP-APTN-1629: Mozambique Flood Residents No access Portugal 4208218
Fast rising floodwaters surprise Pemba residents
AP-APTN-1555: Sri Lanka Raids AP Clients Only 4208210
Investigation continues after Sri Lanka raids
AP-APTN-1548: Cyprus Killings AP Clients Only 4208211
Cyprus police find remains in serial killer probe
AP-APTN-1540: Canada Japan Must credit CTV; No access Canada 4208209
Canada PM Trudeau welcomes Japan PM Abe in Ottawa
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.