ETV Bharat / sports

ధోనీ ఎంత అందంగా ఉన్నాడో!: సాక్షి - MS Dhoni latest news

ధోనీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. తమ హీరో మహీ మైదానంలో అడుగుపెట్టగానే అందరి కళ్లలో కాంతులు విరజిమ్మాయి. ఈ క్రమంలోనే అతని భార్య సాక్షి సింగ్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆసక్తికర పోస్ట్​ చేసింది.

MS Dhoni
ధోనీ
author img

By

Published : Sep 20, 2020, 2:19 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

శనివారం ప్రారంభమైన ఐపీఎల్​లో ధోనీ రాకతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ధోనీ ఎప్పుడెప్పుడు బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగుతాడా అని ఎదురు చూసిన ప్రేక్షకుల కల నెరవేరింది. ఈ క్రమంలోనే మహీ భార్య సాక్షి సింగ్​ ఆదివారం ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ధోనీ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎంత అందంగా ఉన్నాడో అని పేర్కొంది. ముంబయి ఇండియన్స్​పై టాస్​ గెలిచిన తర్వాత ధోనీ మాట్లాడుతున్నప్పటి చిత్రం ఇది. ఇందులో ధోనీ గతంలో కంటే మరింత ఫిట్​గా కనిపించాడు. సరికొత్త స్టైల్​తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

MS Dhoni
సాక్షి సింగ్ పోస్ట్​

సీఎస్కే టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అనంతరం లాక్​డౌన్​ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారని మురళి కార్తిక్​ ధోనీని అడగ్గా.. తనను తాను ఫిట్​గా ఉంచుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించినట్లు పేర్కొన్నాడు.

ఐపీఎల్ ప్రారంభమ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో గెలిచింది సీఎస్కే.​ సెప్టెంబరు 22న రాజస్థాన్​ రాయల్స్​ జట్టుతో షార్జా వేదికగా తర్వాత మ్యాచ్​లో తలపడనుంది.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.