దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ గప్తిల్(36) ఆరంభంలో ఆకట్టుకున్నాడు. చివర్లో విజయ్ శంకర్(25), నబీ(20) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
-
WATCH: Guptill's mammoth top tier six
— IndianPremierLeague (@IPL) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Full video here 📹📹https://t.co/7Lj5XwN8Eg #DCvSRH pic.twitter.com/nGnQpSCDlu
">WATCH: Guptill's mammoth top tier six
— IndianPremierLeague (@IPL) May 8, 2019
Full video here 📹📹https://t.co/7Lj5XwN8Eg #DCvSRH pic.twitter.com/nGnQpSCDluWATCH: Guptill's mammoth top tier six
— IndianPremierLeague (@IPL) May 8, 2019
Full video here 📹📹https://t.co/7Lj5XwN8Eg #DCvSRH pic.twitter.com/nGnQpSCDlu
స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హైదరాబాద్‌ను మోస్తరు పరుగులకే కట్టడి చేసింది దిల్లీ. కీమో పాల్ మూడు వికెట్లతో రాణించగా.. ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బౌల్ట్, అమిత్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు.
-
Paul of duty! 😎#DCvSRH #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/sC6Gk15lcv
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Paul of duty! 😎#DCvSRH #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/sC6Gk15lcv
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2019Paul of duty! 😎#DCvSRH #ThisIsNewDelhi #DelhiCapitals #IPL #IPL2019 pic.twitter.com/sC6Gk15lcv
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2019
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే సాహా(8) వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ గప్తిల్ ధాటిగా ఆడి స్కోరు వేగం పెంచాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేసిన గప్తిల్ ఏడో ఓవర్లో మిశ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. విలియమ్సన్(28), మనీశ్ పాండే(30) వేగంగా ఆడలేకపోయారు. వీరిద్దరూ ఔటైన తర్వాత చివర్లో మెరుపులు మెరిపించారు నబీ, విజయ్‌శంకర్.
17వ ఓవర్ వరకు నిదానంగా సాగింది సన్‌రైజర్స్ ఇన్నింగ్స్. ఆ ఓవర్లో 12 పరుగులు చేసిన నబీ- విజయ శంకర్ జోడి. తర్వాత ఓవర్లో 10 పరుగుల చేసింది. 19 ఓవర్లో 14 పరుగుల రాబట్టుకుంది. చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేయగలిగింది సన్‌రైజర్స్ జట్టు.