ETV Bharat / sports

రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీరే! - morgan

ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. బ్రిటన్​లో పుట్టిన ఈ క్రీడ అనతికాలంలోనే మరెన్నో దేశాలకు విస్తరించింది. ఫుట్​బాల్​ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అంతటి ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరికి తమ దేశం తరఫున క్రికెట్​ ఆడాలని కలలుకంటారు. అయితే కొంతమంది క్రికెటర్లు తమ స్వదేశంతో పాటు మరొక దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో ప్రాతినిధ్యం వహించిన సందర్భాలున్నాయి. అలా రెండు దేశాల క్రికెట్​ టీమ్​లలో ఆడిన వారు ఎవరెవరు అంటే?

List of cricketers who represented two countries in international cricket
వీళ్లు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడేశారు!
author img

By

Published : Sep 20, 2021, 6:36 PM IST

144 ఏళ్ల ప్రపంచ క్రికెట్ ప్రస్థానంలో ఎంతో ఆటగాళ్ల తమతమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా ఒకే క్రికెటర్​ రెండు దేశాల తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో ఆడిన సందర్భాలూ కోకొల్లలు. అయితే రెండు దేశాల తరఫున ఇంటర్నేషన్​ క్రికెట్​ మ్యాచ్​లు ఆడిన తొలి క్రికెటర్​ విలియమ్​ ఎవన్స్​ మిడ్​వింటర్​​. ఇంగ్లాండ్​లో పుట్టిన ఈ క్రికెటర్​ 10 ఏళ్లలో 12 మ్యాచ్​లు ఆడాడు. ఇంగ్లాండ్​తో పాటు ఆస్ట్రేలియా జట్టుకూ ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్​గా ఘనత దక్కించుకున్నాడు.

విలియమ్​ ఎవన్స్​ మిడ్​వింటర్​​ తర్వాత ప్రస్తుతం ఇంగ్లాండ్​ టీ20 జట్టు కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​ కూడా రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐర్లాండ్​లో పుట్టిన ఈ క్రికెటర్​.. తన దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. ఆ జట్టు తరఫున దాదాపుగా 23 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్​ టీమ్​తో చేరిన మోర్గాన్​.. 338 మ్యాచ్​ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరుకు ఇంగ్లాండ్​ జట్టు తరఫున ఇయాన్​ మోర్గాన్​.. 16 టెస్టులు, 220 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. మోర్గాన్​ నాయకత్వంలోనే ఇంగ్లాండ్​ జట్టు తొలి వన్డే ప్రపంచకప్​ గెలుచుకోవడం విశేషం. అయితే వీరిద్దరితో పాటు మరో 30 మంది కూడా అంతర్జాతీయ క్రికెట్​లో రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించారు. వారి వివరాలేమిటో ఒకసారి తెలుసుకుందాం.

రెండు దేశాల తరపున ఆడి రికార్డు సృష్టించిన క్రికెటర్లు..

నెంబర్ క్రికెటర్​ పేరుఆడిన జట్లు
1)విలియం ఎవాన్స్ మిడ్‌వింటర్ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
2) విలియం లాయిడ్ మర్డోక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
3)జాన్ జేమ్స్ ఫెర్రిస్ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
4)శామ్యూల్ జేమ్స్ వుడ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
5)ఫ్రాంక్ హెర్నే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా
6) ఆల్బర్ట్ ఎడ్విన్ ట్రాట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్
7) ఫ్రాంక్ మిచెల్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా
8)ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ ఇంగ్లాండ్, భారత్​
9) గుల్ మహ్మద్ భారత్​, పాకిస్థాన్​
10) అబ్దుల్ హఫీజ్ కర్దార్ భారత్​, పాకిస్థాన్​
11) అమీర్ ఎలహి భారత్​, పాకిస్థాన్​
12)సింప్సన్ క్లైర్మోంటే గిల్లెన్ వెస్టిండీస్, న్యూజిలాండ్
13) అథనాసియోస్ జాన్ ట్రైకోస్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే
14)కెప్లర్ వెస్సెల్స్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
15)క్లేటన్ బెంజమిన్ లాంబెర్ట్ వెస్టిండీస్, యూఎస్ఏ
16)అండర్సన్ క్లియోఫాస్ కమిన్స్ వెస్టిండీస్​, కెనడా
17)డగ్లస్ రాబర్ట్ బ్రౌన్ ఇంగ్లాండ్​, స్కాట్లాండ్
18) గావిన్ మార్క్ హామిల్టన్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్
19) ర్యాన్ జాన్ కాంప్‌బెల్ ఆస్ట్రేలియా, హాంకాంగ్
20)గెరాయింట్ ఓవెన్ జోన్స్ ఇంగ్లాండ్, పాపువా న్యూ గినియా
21)జేవియర్ మెల్‌బోర్న్ మార్షల్ వెస్టిండీస్, యూఎస్ఏ
22)గ్రెగొరీ మార్క్ స్ట్రైడమ్ జింబాబ్వే, కేమాన్ దీవులు
23) ఎడ్మండ్ క్రిస్టోఫర్ జాయిస్ఇంగ్లాండ్, ఐర్లాండ్
24) ఇయాన్ మోర్గాన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్
25)విలియం బాయిడ్ రాంకిన్ ఐర్లాండ్, ఇంగ్లాండ్
26)ల్యూక్ రోంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
27)రోలోఫ్ ఎరాస్మస్ వాన్ డెర్ మెర్వే దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్
28)డిర్క్ పీటర్ నానెస్ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా
29) జువాన్ థెరాన్ దక్షిణాఫ్రికా, యూఎస్ఏ
30)ఇజతుల్లా దావ్లాత్‌జాయ్ అఫ్గానిస్థాన్​, జర్మనీ
31)మార్క్ సింక్లెయిర్ చాప్మన్ హాంగ్ కాంగ్, న్యూజిలాండ్
32)హేడెన్ రషీది వాల్ష్ యూఎస్ఏ, వెస్టిండీస్

ఇదీ చూడండి.. Rohit Sharma IPL: రోహిత్ శర్మ తర్వాత మ్యాచ్​లో ఉంటాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.