ది హండ్రెడ్ టోర్నీలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ ఆయువు పట్టుపై వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. ఆ నొప్పికి అతడు విలవిల్లాడాడు. బహుశా వరుస బంతుల్లో ఇలా బంతి తగలడం చరిత్రలోనే తొలిసారి కావొచ్చని అంటున్నారు!
వంద బంతుల ఈ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్‌కు అలెక్స్ హేల్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతరాత్రి ఓవల్ ఇన్‌విన్సిబుల్స్‌తో ఆ జట్టు తలపడింది. ట్రెంట్ రాకెట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. హేల్స్ ఎప్పటిలాగే ఓపెనింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 13వ బంతిని టాప్లే వేగంగా విసిరాడు. ఆ బంతిని లెగ్ సైడ్ ఆడబోతుండగా మిస్సై అతడి హేల్స్ బాక్స్ ప్రాంతాన్ని బలంగా తాకింది. ఆ నొప్పికి తాళలేక అతడు విలవిల్లాడాడు. నేలపై అలాగే కూలబడి చేతులు పెట్టుకొని వెల్లకిలా అటు ఇటూ దొర్లాడు. ఫిజియో కూడా అతడికి సాయం చేసేందుకు రావడం గమనార్హం.
-
Alex Hales copping back-to-back balls to the crown jewels sounds better with Titanic music 😭😂#TheHundred #PrayforAlex @AlexHales1 pic.twitter.com/vsPlrli4kh
— Spark Sport (@sparknzsport) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Alex Hales copping back-to-back balls to the crown jewels sounds better with Titanic music 😭😂#TheHundred #PrayforAlex @AlexHales1 pic.twitter.com/vsPlrli4kh
— Spark Sport (@sparknzsport) August 9, 2021Alex Hales copping back-to-back balls to the crown jewels sounds better with Titanic music 😭😂#TheHundred #PrayforAlex @AlexHales1 pic.twitter.com/vsPlrli4kh
— Spark Sport (@sparknzsport) August 9, 2021
కాసేపటికి తేరుకున్న హేల్స్ తర్వాతి బంతిని ఆడేందుకు సిద్ధమయ్యాడు. టాప్లే మళ్లీ లెంగ్త్ బంతినే విసిరాడు. వికెట్లకు అడ్డంగా జరిగి ఆడే క్రమంలో హేల్స్ బాక్స్‌కు మళ్లీ బంతి తగిలింది. దీంతో నొప్పిని భరించలేని అతడు అలా కూర్చుండిపోయాడు. ఏం చేయాలో అర్థంకాని ప్రత్యర్థి ఆటగాళ్లు ముసిముసిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అయ్యో అని జాలిచూపిస్తూనే అభిమానులు నవ్వుకుంటున్నారు!
ఇదీ చూడండి:- INDvsENG: లార్డ్స్‌కు టీమ్‌ఇండియా.. క్వారంటైన్‌లో సూర్య, పృథ్వీ