ETV Bharat / sports

టీమ్​ఇండియాకు షాక్.. స్టార్ ఆల్​రౌండర్​కు గాయం.. ఆసియా కప్​ నుంచి ఔట్

ఆసియా కప్​లో దూసుకెళ్తున్న భారత క్రికెట్​ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా కుడి మోకాలికి గాయం కావడం వల్ల ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది.

ravindra jadeja injury
ravindra jadeja injury
author img

By

Published : Sep 2, 2022, 5:57 PM IST

Updated : Sep 2, 2022, 6:53 PM IST

ravindra jadeja asia cup : భారత క్రికెట్​ జట్టు ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా ఆసియా కప్​ నుంచి వైదొలిగాడు. ఆసియా కప్​కు ఆడుతున్న సమయంలో అతనికి కుడి మోకాలికి గాయం కావడం వల్ల ఇకపై జరగనున్న మ్యాచ్​లకు అతడు హాజరు కాలేడని బీసీసీఐ వెల్లడించింది. అతడు ఇప్పుడు బీసీసీఐ మెడికల్​ టీమ్​ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. కాగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్​ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆసియా కప్‌లో టోర్నీలో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 35 పరుగులతో జట్టుకు విలువైన స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఆ తర్వాత హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో కీలక వికెట్‌ తీశాడు. ఇప్పుడు కీలక సమయంలో గాయం కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై ప్రభావం పడుతుందని క్రీడా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

కోహ్లీ బెస్ట్ బ్యాటర్‌.. కానీ ఆసీస్‌తో అంత ఈజీ కాదు: రికీ పాంటింగ్‌

'కేఎల్ రాహుల్‌ క్లాస్​ ఆటగాడు.. అతడికి ఇంకాస్త సమయం అవసరం'

Last Updated : Sep 2, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.