జోరుమీదున్న టీమ్ఇండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టేశాడు. 863 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్ రిజ్వాన్‌ను(842 పాయింట్లు) వెనక్కి నెట్టి ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలతో ధనాధన్ ఇన్నిగ్స్ ఆడిన సూర్య.. మెన్స్ ర్యాంకింగ్స్‌లోనూ రాకెట్లా దూసుకెళ్తున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య 68 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాతే ఈ మార్క్‌ను అందుకున్నాడు. అలాగే ఇదే టోర్నీలో నెదర్లాండ్స్‌పై కూడా కీలక హాఫ్ సెంచరీ చేశాడు.
ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న 23వ క్రికెటర్‌గా సూర్య నిలిచాడు. అలాగే రెండో భారత బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అంతకుముందు గతంలో ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు.
కోహ్లీ ఘనత.. ప్రపంచ క్రికెట్లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అయిన విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. తద్వారా లంక మాజీ ప్లేయర్ జయవర్థనే పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లో 31 మ్యాచుల్లో (31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు. కోహ్లీ 23 ఇన్నింగ్స్‌లోనే జయవర్థనే రికార్డును అధిగమించి 1017 రన్స్‌తో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టాప్-5లో భారత సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. 921 రన్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. విండీస్ వీరుడు గేల్ 965 పరుగులతో 3వ స్థానం), శ్రీలంక ప్లేయర్ దిల్షన్ 897 రన్స్ చేసి 5వ స్థానంలో నిలిచారు.
ఇదీ చూడండి: 'భారతీయుడు 2'లో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ తండ్రి