India vs West Indies 4th T20 : విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టెస్టుల్లో తమ సత్తా చాటిన టీమ్ఇండియా.. టీ20ల్లోకి వచ్చేసరికి విండీస్ ముందు విలవిలలాడుతోంది. అప్పటివరకు ఫామ్‌లో ఉంటూ వచ్చిన ఇండియన్ టీమ్.. టీ20 తొలి రెండు మ్యాచ్‌ల్లో కరేబియన్ జట్టు ఇచ్చిన షాకులతో ఒక్కసారిగా డీలా పడింది. అయితే మరో ఓటమి ఎదురైతే ఇక సిరీస్ చేజారే స్థితిలోకి చేరుకున్న హార్దిక్ సేన.. మూడో టీ20లో నెగ్గి తన వేగాన్ని పుంజుకుంది. కానీ కథ అంతటితో ఆగిపోలేదు. రానున్న నాలుగో టీ20లోనూ అదే పరిస్థితి.. ఈ మ్యాచ్ ఓడినా సరే సిరీస్ పోతుంది. అందుకే తమకున్న పట్టుదలను, తీవ్రతను కొనసాగిస్తూ మరో విజయాన్ని కైవసం చేసుకునేందుకు హార్దిక్ సేన తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా వేదికగా జరగనున్న చివరి రెండు టీ20ల్లో భారత జట్టు ఏ మేర ప్రదర్శన చూపిస్తుందో వేచి చూడాలి.
గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైన తర్వాత పొట్టి క్రికెట్ కోసం.. సారధ్య బాధ్యతలు అందుకున్నాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. ఇక ఇప్పటి వరకు ఆడిన నాలుగు సిరీస్‌ల్లోనూ భారత్‌దే విజయంగా నడుస్తూ వస్తోంది. విండీస్ పర్యటనలో భాగంగా ఇప్పుడు మనం ఐదో సిరీస్‌ను ఆడుతున్నాం. ఈ క్రమంలో తొలిసారి సిరీస్ కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న హార్దిక్.. దీన్ని ఎలా అధిగమిస్తాడు అన్నది ఆసక్తికర విషయం.
మరోవైపు ప్రమాదకర టీ20 ఆటగాళ్లతో నిండిన విండీస్‌ను మూడో మ్యాచ్‌లో తేలిగ్గానే ఓడించిన భారత్.. అదే ఊపులో మరో విజయాన్ని తమ ఖాతాలోకి వేసుకోవాలని చూస్తోంది. అయితే బ్యాటింగ్‌కు బాగా సహకరించే లాడర్‌హిల్ పిచ్‌పై విండీస్ ప్లేయర్లను ఆపి సిరీస్ సాధించడం అనేది అంత తేలికైన విషయం కాదు.
Tilak Varma In IND VS WI T20 : ఇక ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నది హైదరాబాదీ యువ ఆటగాడు తిలక్ వర్మ అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొడుతూ వచ్చిన తిలక్.. మూడు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. 20 ఏళ్ల వయసులోనే అతను చూపిస్తున్న ప్రదర్శన ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది. అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. వన్డే ప్రపంచకప్‌కు బలమైన పోటీదారుగా మారుతాడు అన్న విషయం ఖాయం. అంతే కాకుండా బ్యాటింగ్ పిచ్‌పై అతను మరింత చెలరేగుతాడేమో వేచి చూడాలి.
ఇక ఒకప్పటి తన ఆట తీరును గుర్తు చేస్తూ గత మ్యాచ్‌లో చెలరేగిపోయిన సూర్యకుమార్ యాదవ్ నుంచి హార్దిక్ సేన మరో మెరుపు ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. అయితే ఓపెనర్ శుభ్‌మన్ ఫామ్ అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌లోనే టీ20 అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ కూడా రానున్న మ్యాచ్‌లో తనదైన ముద్రను వేయాల్సి ఉంది. ఇక తనకిచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ ఏ మేర ఉపయోగించుకుంటాడో కూడా రానున్న మ్యాచ్‌లో చూడాల్సిందే.
మరోవైపు బౌలింగ్‌లో కుల్‌దీప్, చాహల్, అర్ష్‌దీప్ ఈ మ్యాచ్‌కు కీలకం కానున్నారు. పరుగుల పిచ్ మీద విండీస్ బ్యాటర్లను ఆపడం అనేది భారత బౌలర్లకు అంత తేలిక కాదు. ముఖ్యంగా రోమన్ పావెల్, పూరన్, హెట్‌మయర్‌లకు అవకాశమిస్తే ఇక అంతే.. తమ ప్రదర్శనతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంటారు.
అయితే భారత తుది జట్టులో మార్పులేమీ లేకపోవచ్చు కానీ.. విండీస్‌లో మాత్రం రోస్టన్ చేజ్‌కు బదులుగా హోల్డర్‌ను ఎంచుకునే అవకాశముంది. ఇక అతడితో పాటు అకీల్ హొసీన్, రొమారియో షెఫర్డ్, మెకాయ్, అల్జారి జోసెఫ్‌లతో విండీస్ బౌలింగ్ మెరుగ్గానే కనిపిస్తోంది.
India VS West Indies T20 Squad : తుది జట్లు (అంచనా)..
భారత్: యశస్వి, శుభ్‌మన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ (కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, ముకేశ్ కుమార్, చాహల్.
వెస్టిండీస్: మేయర్స్, కింగ్, చార్లెస్, పూరన్, రోమన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మయర్, హోల్డర్/చేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హొసీన్, అల్జారి జోసెఫ్, మెకాయ్.
లాడర్‌హిల్‌లో జరిగిన చివరి రెండు టీ20ల్లో భారత్ వరుసగా 191/5, 188/7 స్కోర్లు చేసింది. ఇక వెస్టిండీస్‌తో జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌దే పై చేయిగా నిలిచింది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తుంది.
ఇప్పటి వరకు లాడర్‌హిల్‌లో జరిగిన 13 టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే 11 సార్లు విజయాన్ని సొంతం చేసుకుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు దాదాపు బ్యాటింగే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్‌కు కొంతమేర వర్షం ముప్పుండటం వల్ల ఛేదనకు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు.
ఇక టీ20ల్లో వంద మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలవడానికి చాహల్‌కు 5 వికెట్లు అవసరం. లాడర్‌హిల్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఆరు టీ20ల్లో తలపడింది. భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. వెస్టిండీస్ ఓ విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.
-
𝙏𝙤𝙪𝙘𝙝𝙙𝙤𝙬𝙣 Miami ✈️#TeamIndia | #WIvIND pic.twitter.com/SKJTbj0hgS
— BCCI (@BCCI) August 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝙏𝙤𝙪𝙘𝙝𝙙𝙤𝙬𝙣 Miami ✈️#TeamIndia | #WIvIND pic.twitter.com/SKJTbj0hgS
— BCCI (@BCCI) August 10, 2023𝙏𝙤𝙪𝙘𝙝𝙙𝙤𝙬𝙣 Miami ✈️#TeamIndia | #WIvIND pic.twitter.com/SKJTbj0hgS
— BCCI (@BCCI) August 10, 2023
Surya Kumar Yadav T20 Records : విండీస్‌పై చెలరేగిన సూర్య.. దెబ్బకు ఆ ముగ్గురి రికార్డులు బ్రేక్..