ETV Bharat / sports

IND VS WI 2023 : సిరాజ్ దెబ్బకు విండీస్ విలవిల​.. పట్టుబిగించిన భారత్‌ - siraj five wickets

IND VS WI 2023 : రెండో టెస్టుపై టీమ్‌ఇండియా పట్టుబిగించింది. మూడో రోజు కాస్త దూకుడుగా ఆడిన విండీస్‌కు అడ్డుకట్టవేసింది. ఆ వివరాలు..

WI vs IND
IND VS WI 2023 : నిప్పులు చెరిగిన సిరాజ్​.. పట్టుబిగించిన భారత్‌
author img

By

Published : Jul 24, 2023, 6:51 AM IST

IND VS WI 2023 : విండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్​ఇండియా పట్టు బిగిస్తోంది. ఫస్ట్​ ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 255 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఫలితంగా 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్‌ చేసి ప్రత్యర్థి జట్టు ముందు 365 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ భారీ లక్ష్యఛేదనలో నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది విండీస్​. ఆ జట్టు విజయానికి ఇంకా 289 పరుగులు అవసరం. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (16), బ్లాక్‌వుడ్ (20) క్రీజులో కొనసాగుతున్నారు. నిలకడగా ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ ( 52 బంతుల్లో 28; 5 ఫోర్లు), కిర్క్‌ మెకంజీలను(0) అశ్విన్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపాడు.

సిరాజ్‌ జోరు.. ఓవర్‌నైట్‌ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన విండీస్ జట్టు.. .. 7.4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ (5/60) ఆ జట్టుపై విరుచుకుపడ్డాడు. చివరి నాలుగు వికెట్లు అతడు తీసినవే కావడం విశేషం. ఆట ప్రారంభం అవ్వగానే.. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అథనేజ్‌(37) ఆరో వికెట్​గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జేసన్‌ హోల్డర్‌(15).. జోసెఫ్‌, కీమర్‌రోచ్‌ (4), కీమర్‌రోచ్‌ (4), గాబ్రియెల్‌ (0)లను పెవిలియన్‌కు పంపాడు సిరాజ్​. దీంతో ఆతిథ్య జట్టు ఆలౌట్ అయింది.

రోహిత్‌-ఇషాన్‌ దూకుడు.. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన టీమ్​ఇండియా.. ఆ ఉత్సాహంలోనే రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 57; 5x4, 3x6), ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 52; 4 x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (30 బంతుల్లో 38; 4x4, 1x6) దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్‌ గిల్ (37 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇదీ చూడండి :

Ind vs Pak Final 2023 : ఫైనల్​లో భారత్ ఓటమి.. ఎమర్జింగ్ ట్రోఫీ పాక్​దే!

హర్మన్​ప్రీత్​కు షాక్​.. ఆ చర్య వల్ల భారీ మొత్తంలో ఫైన్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.