శ్రీలంక(Srilanka series)లో పర్యటిస్తున్న భారత జట్టు కూర్పుపై స్పష్టత లభించినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా ఎవరెవరు బరిలోకి దిగుతున్నారో తెలిసింది. సారథి శిఖర్ ధావన్‌తో పాటు పృథ్వీ షా(Sikhar Dhawan-Prithvi Shah) ఓపెనింగ్ చేస్తాడని అంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్ మరికొంత సమయం ఆగాల్సి ఉంటుంది.
"దేశవాళీ క్రికెట్లో పృథ్వీషా పరుగుల వరద పారించాడు. ఓపెనింగ్ భాగస్వాములుగా శిఖర్ ధావన్, షాకు మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ వారు ఒకే జట్టుకు ఓపెనింగ్ చేస్తారు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో తొలి వన్డేలో మరొకరు ఓపెనింగ్ చేస్తారంటే ఆశ్చర్యమే! రుతురాజ్, పడిక్కల్ మరికాస్త ఓపిక పట్టాలి" అని కొలంబోలోని భారత వర్గాలు అంటున్నాయి.
భారత జట్టులో ఇప్పుడు ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. సారథిగా శిఖర్ ధావన్ జట్టును నడిపిస్తున్నాడు. అతడి తర్వాత పృథ్వీ షాకే ఓపెనర్‌గా అంతర్జాతీయ అనుభవం ఉంది. పైగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఇక మిగిలింది రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పడిక్కల్, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున రుతురాజ్ అదరగొట్టారు. నితీశ్ ఓపెనింగే కాకుండా వన్‌డౌన్‌లో ఆడగలడు.
ఇదీ చూడండి: IND Vs SL: భారత్-శ్రీలంక మ్యాచ్ వేళల్లో మార్పు