ETV Bharat / sports

రింకు మెరుపు ఇన్నింగ్స్‌ వృథా - దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి - ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20 స్కోర్

India vs South Africa 2nd T20I : : సౌతాఫ్రికా టూర్​లో భాగంగా జరిగిన రెండో టీ20లోటీమ్​ఇండియా ఓటమిని చవి చూసింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతిలో స్కోర్​ను నిర్ణయించగా, ఆ లక్ష్యాన్ని సఫారీలు ఈజీగా ఛేదించారు. దీంతో 5 వికెట్ల తేడాతో భారత్​ ఓటమిపాలైంది.

India vs South Africa 2nd T20I
India vs South Africa 2nd T20I
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 7:02 AM IST

India vs South Africa 2nd T20I : సౌతాఫ్రికా టూర్​ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సఫారీలు రెండో టీ20లోటీమ్​ఇండియాపై పై చేయి సాధించారు. రింకు సింగ్‌ మరోసారి చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ అతడి ప్రయత్నం సరిపోలేదు. మరోవైపు భారత బౌలర్లు విఫలమవ్వడం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతిలో 5 వికెట్ల తేడాతో భారత్​ ఓటమిపాలైంది.

రింకు సింగ్‌ (68), సూర్యకుమార్‌ యాదవ్‌ (56), మెరుపులతో మొదట భారత్‌ 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అయితే వర్షం వల్ల టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 19.3 ఓవర్ల వద్దే ముగిసింది. ఇక హెండ్రిక్స్‌ (49), మార్‌క్రమ్‌ (30), చెలరేగడం వల్ల డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో నిర్ణయించిన లక్ష్యాన్ని (15 ఓవర్లలో 152 పరుగులను) దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక సౌతాఫ్రికా జట్టులోని షంసి (1/18) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అందుకున్నాడు. మరోవైపు చివరి మూడో టీ20 గురువారం జరుగనుంది. ఇక తొలి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.

బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ టీమ్‌ఇండియా ఆరంభంలో తడబడింది. తొలి రెండు ఓవర్లలో 38 పరుగులు సాధించిన హెండ్రిక్స్‌, బ్రీజ్కె (16) సౌతాఫ్రికాకు అదిరే ఆరంభాన్నిచ్చారు. పేలవ బౌలింగ్‌ వల్ల అర్ష్‌దీప్‌ రెండో ఓవర్లో ఏకంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్​లో బ్రీజ్కెను జడేజా ఔట్‌ చేసినప్పటికీ భారత్‌కు పెద్దగా ఉపశమనం కలగలేదు. ఇక హెండ్రిక్స్‌తో పాటు మార్‌క్రమ్‌ కూడా ఎడాపెడా బాల్​ను బౌండరీలు దాటిస్తూ చెలరేగిపోయాడుయ. ఈ ఇద్దరూ తమ ఇన్నింగ్స్​లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో ముకేశ్‌, కుల్‌దీప్‌ లాంటి సూపర్ బౌలర్స్ బ్యాటర్లను నియంత్రించలేకపోయారు.

అలా 7.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 96/2తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ స్థితిలో భారత్‌ చకచకా మూడు వికెట్లు (మార్‌క్రమ్‌, హెండ్రిక్స్‌, క్లాసెన్‌) పడగొట్టింది. దీంతో ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ కాస్త ఆసక్తికరంగా సాగింది. అయితే ఆతిథ్య జట్టుకు లక్ష్యం బాగా అందుబాటులోనే ఉంది. కానీ విజయం కోసం చివరి అయిదు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆ దశలో మిల్లర్‌ (17), స్టబ్స్‌ (14 నాటౌట్‌) ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 14 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో మిల్లర్‌ ఔటైనప్పటికీ ఫెలుక్వాయో (10 నాటౌట్‌), స్టబ్స్‌ పని పూర్తి చేశారు.

బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్- 33మంది ప్లేయర్లతో టీమ్ఇండియా- ఏ టోర్నీకైనా రెడీ!

'అలాంటి వారికి కెప్టెన్సీ ఇవ్వకూడదు'- టీ20 వరల్డ్​కప్​ సారథిపై గంభీర్ కామెంట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.