ETV Bharat / sports

భారత్​తో టెస్టు సిరీస్​.. జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ - jofra archer

టీమ్ఇండియాతో టెస్టు సిరీస్​లో భాగంగా తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board). విద్వేషపూరిత ట్వీట్ల కారణంగా క్రికెట్ నుంచి నిషేధం విధించిన యువ బౌలర్​ రాబిన్సన్​ను (Ollie Robinson) తిరిగి జట్టులోకి తీసుకున్నారు. స్టార్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ను ఈ సిరీస్​కు కూడా పక్కన పెట్టారు.

england squad, robinson
ఇంగ్లాండ్ జట్టు, రాబిన్​సన్
author img

By

Published : Jul 21, 2021, 7:01 PM IST

టీమ్ఇండియాతో తొలి రెండు టెస్టులకు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు(England and Wales Cricket Board). మోచేతి గాయంతో ఆటకు దూరంగా ఉంటున్న ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ను ఈ సిరీస్​కు కూడా పక్కన పెట్టింది. బెన్​ స్టోక్స్​, ఒల్లీ రాబిన్సన్​ను(Ollie Robinson) తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఇక తొలి రెండు టెస్టులకు టీమ్​లో చోటు దక్కని క్రిస్​ వోక్స్​కు.. తర్వాత మ్యాచ్​ల కోసం తీసుకునే అవకాశం ఉంది.

జూన్​లో కివీస్​తో జరిగిన రెండు టెస్టుల సిరీస్​కు దూరమైన స్టోక్స్​ను తిరిగి జట్టులోకి తీసుకుంది ఇంగ్లాండ్. ఐపీఎల్​లో వేలికి గాయమైన తర్వాత ఆటకు దూరంగా ఉన్న స్టోక్స్​ను.. పాక్​తో సిరీస్​కు కూడా పక్కన పెట్టారు. కానీ, చాలా మంది కొవిడ్ బారిన పడటం వల్ల స్టోక్స్​ కెప్టెన్​గా మరో జట్టును సిద్ధం చేసింది ఇంగ్లాండ్. జోస్ బట్లర్​, జానీ బెయిర్​ స్టో, సామ్ కరన్​ కూడా తిరిగి టీమ్​లోకి వచ్చారు.

ఇదీ చదవండి: గ్రౌండ్​లోనే గొడవ.. బ్యాట్లతో కొట్టుకున్న క్రికెటర్లు​!

రాబిన్సన్​ అప్పుడే..

ఎనిమిదేళ్ల క్రితం ట్విట్టర్ వేదికగా మహిళలపై విద్వేషపూరిత ట్వీట్లు చేశాడు రాబిన్సన్​. సుదీర్ఘ ఫార్మాట్​లో న్యూజిలాండ్​పై అరంగేట్ర మ్యాచ్​ ఆడిన అనంతరం ఇవి వెలుగులోకి వచ్చాయి. తక్షణ చర్యగా అతనిపై నిషేధం విధించింది ఇంగ్లాండ్​ బోర్డు. అనంతరం అతనిపై దర్యాప్తు జరిపి.. 8 మ్యాచ్​ల నిషేధం విధించింది. వాటిలో ఐదింటిని రెండేళ్లపాటు వాయిదా వేసింది. మిగిలిన 3 మ్యాచ్​ల సస్పెన్షన్​ను వెంటనే అమలు చేయాలని చెప్పింది. అయితే దర్యాప్తు కారణంగా న్యూజిలాండ్​తో రెండో టెస్టు, సస్సెక్స్​ టీ20లో రెండు మ్యాచ్​లకు అతడు దూరంగా ఉండటాన్ని శిక్ష అనుభవించినట్లుగానే ప్యానెల్​ భావించింది. దీంతో తిరిగి జట్టులోకి తీసుకుంది.

ఇక ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ ట్రెంట్​ బ్రిడ్జ్​ వేదికగా ఆగస్టు 4న ప్రారంభం అవుతుంది. రెండో టెస్టు లార్డ్స్​ వేదికగా ఆగస్టు 12 నుంచి జరగనుంది.

ఇంగ్లాండ్ స్క్వాడ్​..

జో రూట్​(కెప్టెన్), జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్​ స్టో, డామ్ బెస్, స్టువర్ట్​ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, జాక్ క్రావ్లే, సామ్ కరన్, హసీబ్​ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్​సన్, డామ్ సిబ్లే, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్​.

ఇదీ చదవండి: ICC Rankings: మెరుగైన ధావన్​, చాహల్ స్థానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.