ETV Bharat / sports

ఫైనల్​కు రెడీ- ఆసీస్​ను తక్కువ అంచనా వేయకూడదు : రోహిత్ శర్మ

India Vs Australia World Cup 2023 Final : ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్​ కప్​ ఫైనల్​ మ్యాచ్​ కోసం తాము అంతా సిద్ధంగా ఉన్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఆసీస్​ జట్టు కూడా తక్కువేమి కాదని చెప్పాడు. ప్రీ మ్యాచ్​ ప్రెస్​ కాన్ఫరెన్స్​లో ఈ మేరకు రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇంకా ఏం న్నాడంటే?

India Vs Australia World Cup 2023 Final
India Vs Australia World Cup 2023 Final
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 10:19 PM IST

Updated : Nov 19, 2023, 6:50 AM IST

India Vs Australia World Cup 2023 Final : దేశం మొత్తం వరల్డ్​ కప్​ ఫైనల్​ ఫీవర్​తో ఊగిపోతోంది. అహ్మదాబాద్​ వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్​ సమరం మరి కొద్ది గంటల్లో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్​ను ముద్దాడుతుందా.. లేదా ఆరోసారి ఆసీస్​ టైటిల్​ ఎగరేసుకుపోతుందా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ మ్యాచ్​ ప్రెస్​ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫైనల్​ మ్యాచ్​ కోసం అన్ని విధాలా తాము సిద్ధం అయినట్లు తెలిపాడు. తమకు ఏం చేయాలో తెలుసునని స్పష్టం చేశాడు .

"నేను భారత క్రికెట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఇలాంటి ఒక రోజు కోసమే ఎదురు చూశాను. ఈ ప్రపంచకప్‌ కోసం మేము రెండేళ్ల కిందటి నుంచి సన్నాహాలు మొదలుపెట్టాము. అన్ని ఫార్మాట్​లలో మేము ఒక యూనిట్‌గా అద్భుతంగా ఆడుతున్నాం. టీమ్​లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి పొజిషన్​పై ఒక క్లారిటీ ఉంది. అన్ని ఫార్మాట్‌లలో ప్లేయర్ల ప్రదర్శనను బట్టి ఛాన్స్​లు ఇస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాం. ఆదివారం కూడా అదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నాను. ఇక ఆసీస్​ను మేము తేలికగా తీసుకోకూడదు. వరల్డ్ వైడ్​గా క్రికెట్‌లో అత్యుత్తమ టీమ్​లో ఆసీస్​ ఒకటి. ఈ వరల్డ్​ కప్​లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు ఎలా ఆడగలదో మాకు తెలుసు"
--రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్

ఆసీస్​ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని రోహిత్ శర్మ చెప్పాడు. అయినా తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని తెలిపాడు. వారిని చూసి తాము ఆందోళన చెందడం లేదని.. ఈ వరల్డ్​ కప్​ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉంటుందని చెప్పాడు. కానీ వాటిన్నంటిని తట్టుకుని ఎలా ఆడాలో తమకు బాగా తెలుసునని.. వాటన్నింటి గురించి ఆందోళన చెందకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లో మేము ప్రశాంతమైన వాతావారణం క్రియేట్​ చేసుకున్నామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

భారత్​ x ఆస్ట్రేలియా - నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎలా ఉందంటే?

'ఫైనల్లో భారత్ గెలిస్తే జట్టులోని ప్రతి ఒక్కరికి ఓ ప్లాట్​' బీజేపీ బంపర్ ఆఫర్​!​

Last Updated : Nov 19, 2023, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.