India vs Australia 5th T20 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీసుల్లో భారత్ ఇప్పటికే ఆధిక్యాన్ని చేజిక్కించుకుని దూసుకెళ్తోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 పాయింట్లతో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఇది నామమాత్రంగానే అయినప్పటికీ.. సౌతాఫ్రికా టూర్‌కు ముందు దీన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌గా భావించి ఆడాలి. యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు వేదిక కానున్న బెంగళూరు పిచ్ గణాంకాల గురించి ఓ సారి తెలుసుకుందాం.
- చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటి వరకు టీమ్ఇండియా ఆరు టీ20లను ఆడింది. అయితే, అందులో కేవలం రెండు మ్యాచుల్లోనే గెలిచింది. మరో మూడింట్లో ఓటమిని చవి చూశారు. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. మరోవైపు ఆసీస్ మాత్రం ఇక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది.
- ఇక ఈ స్టేడియంలో భారత జట్టు సగటు స్కోరు 138 పరుగులు. ఆసీస్‌కు మాత్రం 175 రన్స్. ఈ వేదికపై భారత్ అత్యధికంగా 202/6 స్కోరు చేసింది. 2017లో ఇంగ్లాండ్‌పై 75 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అయితే 2019లో ఆసీస్‌కు భారత్‌పై 19.4 ఓవర్లకు 194/3. టీమ్‌ఇండియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
- చిన్నస్వామి వేదికగా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐదు మ్యాచుల్లో 116 పరుగులు చేశాడు. ఇక ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా విరాట్ కావడం విశేషం. మరోవైపు 2019లో అత్యధిక వ్యక్తిగత స్కోరును ఆసీస్‌పై విరాట్ (72*) నమోదు చేశాడు.
- అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ చెరో ఏడేసి సిక్స్‌లు బాదారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చాహల్. అతడు మూడు మ్యాచుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా 6/25.
- ఈ స్టేడియంలో జరిగిన టీ20లో అత్యధిక భాగస్వామ్యాన్ని నిర్మించిన బ్యాటర్లు ఎంఎస్ ధోనీ - విరాట్ కోహ్లీ. ఆసీస్‌పై 2019లో నాలుగో వికెట్‌కు వంద పరుగులను జోడించారు. ఈ గ్రౌండ్‌లో ఎక్కువ క్యాచ్‌లను అందుకొన్న ఫీల్డర్ విరాట్ కోహ్లీ. అతడు ఐదు క్యాచ్‌లను పట్టాడు.
పిచ్, వాతావరణం రిపోర్ట్ ఇదీ..
బెంగళూరులో ఆదివారం స్వల్పంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ఆక్యూవెదర్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు తక్కువే. బెంగళూరు మైదానం చాలా చిన్నది. ఇక్కడ బౌండరీ లైన్లు కూడా దగ్గరగానే ఉంటాయి. దీంతో పరుగులు సులువుగా వస్తాయి. స్పిన్నర్లకు కాస్త సాయంగా అనిపించినప్పటికీ బ్యాటింగ్‌కే పూర్తి అనుకూలంగా ఉంటుంది. దీంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై ఆసీస్ బ్యాటర్ మాక్స్‌వెల్ ఒంటిచేత్తో పరుగుల వరద పారించి మ్యాచ్‌ను గెలిపించాడు. అన్ని ఫార్మాట్లు కలిపి తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 12 సార్లు విజయం సాధించింది. ఇక ఛేజింగ్ చేసిన టీమ్‌లూ 14 మ్యాచుల్లో గెలవడం గమనార్హం.
-
✈️ Touchdown Bengaluru! #TeamIndia are here for the 5⃣th & final #INDvAUS T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/Do8dCnpkuF
— BCCI (@BCCI) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">✈️ Touchdown Bengaluru! #TeamIndia are here for the 5⃣th & final #INDvAUS T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/Do8dCnpkuF
— BCCI (@BCCI) December 2, 2023✈️ Touchdown Bengaluru! #TeamIndia are here for the 5⃣th & final #INDvAUS T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/Do8dCnpkuF
— BCCI (@BCCI) December 2, 2023
భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన- నాలుగో టీ20లో ఘన విజయం- సిరీస్ టీమ్ఇండియాదే
భారత్-ఆసీస్ నాలుగో టీ20కి కరెంట్ కష్టాలు- జనరేటర్లపైనే భారం- గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి!