ETV Bharat / sports

భారత్​ x అఫ్గనిస్థాన్ - తొలి మ్యాచ్​కు విరాట్ దూరం - రోహిత్​కు జోడీ ఎవరంటే ? - ఇండియా vs అఫ్గనిస్థాన్​

India Vs Afghanistan 1st T20 : పంజాబ్​లోని మొహాలీ వేదికగా గురువారం అఫ్గానిస్థాన్‌తో భారత్​ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్​ జరగనుంది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కంటే ముందు భారత్‌ ఆడనున్న చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌ ఇదే కావడం వల్ల ఈ సిరీస్​పై క్రికెట్​ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా 14 నెలల గ్యాప్​ తర్వాత భారత టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీపై కూడా అందరి దృష్టి నెలకొంది.

India Vs Afghanistan 1st T20
India Vs Afghanistan 1st T20
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 6:31 AM IST

Updated : Jan 11, 2024, 7:05 AM IST

India Vs Afghanistan 1st T20 : ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్‌కు టీమ్​ఇండియా సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌, అఫ్గానిస్థాన్​ జట్లు గురువారం మొహాలీ వేదికగా తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. 14 నెలల గ్యాప్ తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి రావడం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. ఈ సిరీస్‌కు వారిని ఎంపిక చేయడం ద్వారా టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో వారు ఉంటారంటూ సెలక్టర్లు సంకేతాలు ఇచ్చారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు హర్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ టీమ్​ఇండియాకు దూరమయ్యారు. దీంతో రోహిత్‌ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను శుభమన్‌ గిల్‌ లేదా యశస్వీ జైశ్వాల్‌ ఆరంభించే అవకాశం ఉంది.

సౌతాణాఫ్రికా పర్యటనలో పెద్దగా రాణించని శుభమన్‌ గిల్‌ అఫ్గానిస్థాన్​ సత్తా చాటడం ద్వారా తిరిగి గాడిలో పడాలని కోరుకుంటున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ కీలకం కానున్నాడు. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌ శర్మకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కింద శివమ్‌ దుబే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్ల కింద అక్షర్‌పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అర్షదీప్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్​​ కుమార్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కులదీప్‌ యాదవ్‌ లేదా రవి బిష్ణోయ్‌కు తుది జట్టులో స్థానం దక్కవచ్చు.

మరోవైపు అఫ్గానిస్థాన్ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కీలక ఆటగాడు, స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతోంది. గత ఏడాది వెన్నుకు శస్త్ర చికిత్స చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్ద పెద్ద జట్లను ఓడించి అఫ్గానిస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టీ20 సిరీస్‌లో భారత్‌పై కూడా సత్తా చాటాలని అఫ్గాన్ జట్టు కోరుకుంటోంది. మ్యాచ్‌ గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

అఫ్గాన్​ జట్టుకు ఊరట - ఆ ముగ్గురిపై బ్యాన్​ ఎత్తివేత

టీమ్ఇండియాకు షాక్- తొలి టీ20కి విరాట్ దూరం- కారణం ఏంటంటే?

Last Updated : Jan 11, 2024, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.