ETV Bharat / sports

టీమ్​ఇండియాను ఈసారి పక్కా ఓడిస్తాం: ఆసీస్ కోచ్

ఈసారి కోహ్లీసేనను ఓడించే సత్తా తమకు ఉందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్. ఈ రెండు జట్ల మధ్య నవంబరు 27న తొలి వన్డే జరగనుంది.

We've got the team to beat India this time: Australia coach Justin Langer
భారత్ vs ఆస్ట్రేలియా
author img

By

Published : Oct 30, 2020, 7:30 PM IST

త్వరలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​ల్లో తమ జట్టు, టీమ్​ఇండియాను ఓడిస్తుందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు.

పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లనున్న టీమ్​ఇండియా.. నవంబరు 27 - జనవరి 19 మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది.

Australia coach Justin Langer
ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్

2018-19లో ఆసీస్ పర్యటనకు భారత్​ వెళ్లినప్పుడు లాంగర్ కోచ్​గా ఉన్నాడు. ఆ సమయంలోనే కోహ్లీసేన టెస్టు సిరీస్​ను సొంతం చేసుకుంది. నిషేధం వల్ల అప్పుడు ఆడలేకపోయిన స్మిత్, వార్నర్​.. ఇప్పుడు జట్టులో ఉండటం వల్ల ఆసీస్ బలంగా కనిపిస్తోంది.

నవంబరు 10న ఐపీఎల్ పూర్తయిన​ తర్వాతి రోజు, లీగ్​లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు స్వదేశానికి పయనమవుతారు. అనంతరం రెండు వారాల క్వారంటైన్​లో ఉండి, భారత్​తో మ్యాచ్​లు ఆడతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.