ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఎక్కడ జరిగినా టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. జట్టుకు అందుబాటులో ఉంటాడని సమాచారం. డిసెంబర్ 16న సిడ్నీ చేరుకున్న రోహిత్.. అప్పటి నుంచీ అక్కడే 14రోజుల క్వారంటైన్లో ఉన్నాడు. సిడ్నీలో కొవిడ్ ఉద్ధృతి వేళ జనవరి 7న జరగాల్సిన మ్యాచ్ వేదిక మెల్బోర్న్కు మారితే.. రోహిత్ మరోసారి క్వారంటైన్లో ఉంటాడా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే మరోసారి క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఆసీస్ క్రికెట్ బోర్డు అధికారులు.
డిసెంబర్ 30న నిర్బంధాన్ని పూర్తి చేసుకొని వారం ముందుగానే జట్టుతో కలవనున్నాడు హిట్‌మ్యాన్. అయితే అది సిడ్నీలోనా, మెల్బోర్న్లోనా అనేది తెలియాల్సి ఉంది. సిడ్నీలో కాకుండా మెల్బోర్న్లో రోహిత్‌ను క్వారంటైన్ చేయాలని సీఎను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరినట్లు తెలుస్తోంది. అలా అయితే ముందుగానే అతడు జట్టుతో కలిసే వీలుంటుంది. కానీ ఈ విజ్ఞప్తిని సీఎ నిరాకరించింది. రోహిత్.. గదిలోనే శిక్షణ పొందేందుకు వీలుగా డబుల్ బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌ను కేటాయించినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే?