ఆస్ట్రేలియా సిరీస్ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియాకు ఉత్సాహాన్నిచ్చే వార్త. ఐపీఎల్‌లో గాయాలకు గురైన వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ దాదాపుగా కోలుకున్నట్లే. తొడ కండరాల గాయానికి గురైన టెస్టు వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా తిరిగి సాధన మొదలెట్టగా.. ఇషాంత్ పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు.
ఐపీఎల్ నుంచి జట్టుతో పాటే సిడ్నీ చేరుకున్న వృద్ధిమాన్ బుధవారం నెట్స్‌లో కనిపించాడు. బౌలర్ల నుంచి త్రో డౌన్లను ఎదుర్కొన్నాడు. అయితే అతడు వికెట్ కీపింగ్ సాధన చేయలేదు. ఐపీఎల్ సందర్భంగా 36 ఏళ్ల సాహాకు తొడ కండరాల గాయమైంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు (డిసెంబరు 17-21) సమయానికి అతడు పూర్తిగా కోలుకుంటాడని భావిస్తున్నారు. సాహా ఇప్పటివరకు 37 టెస్టుల్లో 1238 పరుగులు చేశాడు.
-
Look who is batting in the nets today. Hello @Wriddhipops! 💪 #TeamIndia pic.twitter.com/GEzLKcSdVF
— BCCI (@BCCI) November 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look who is batting in the nets today. Hello @Wriddhipops! 💪 #TeamIndia pic.twitter.com/GEzLKcSdVF
— BCCI (@BCCI) November 18, 2020Look who is batting in the nets today. Hello @Wriddhipops! 💪 #TeamIndia pic.twitter.com/GEzLKcSdVF
— BCCI (@BCCI) November 18, 2020
బౌలింగ్ వేస్తున్న ఇషాంత్
పక్కటెముకల గాయంతో ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్ ఆడి స్వదేశానికి తిరిగొచ్చిన ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సాధించినట్లే కనిపిస్తున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్న అతడు బుధవారం ఎన్‌సీఏ అధిపతి రాహుల్ ద్రవిడ్, ఫిజియో ఆశిష్ కౌశిక్, కోచింగ్ సిబ్బంది సమక్షంలో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. పూర్తిగా ఫిట్టయినట్లు ప్రకటిస్తే.. ఇషాంత్ ఆస్ట్రేలియా పయనమవుతాడు. ఆస్ట్రేలియాలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతడు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆసీస్‌లో ఇషాంత్ మూడు టెస్టులు ఆడగలిగితే కపిల్‌దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడిన భారత రెండో ఫాస్ట్‌బౌలర్‌గా ఘనత సాధిస్తాడు. టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయికి అతడు మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు.