టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాలో ఎంతో ప్రతిభ ఉందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్. అతడిని నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడించాలని సూచించాడు.
-
Good XI. Shaw has made a lot of runs in domestic cricket, so he has talent. I think India should look at him at 4 or 5 for the long term, where his technique will be better suited. #IndvAus https://t.co/X3jiMpItzT
— Brad Hogg (@Brad_Hogg) December 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good XI. Shaw has made a lot of runs in domestic cricket, so he has talent. I think India should look at him at 4 or 5 for the long term, where his technique will be better suited. #IndvAus https://t.co/X3jiMpItzT
— Brad Hogg (@Brad_Hogg) December 22, 2020Good XI. Shaw has made a lot of runs in domestic cricket, so he has talent. I think India should look at him at 4 or 5 for the long term, where his technique will be better suited. #IndvAus https://t.co/X3jiMpItzT
— Brad Hogg (@Brad_Hogg) December 22, 2020
"దేశవాళీ క్రికెట్లో పృథ్వీ చాలా పరుగులు చేశాడు. అంటే అతను ప్రతిభావంతుడని అర్థం. దీర్ఘకాలంలో భారత్ అతడిని నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడించాలి. అక్కడే అతడి టెక్నిక్ బాగా కుదురుతుంది" అని తెలిపాడు హాగ్.
అడిలైడ్‌లో పరుగులు రాబట్టడానికి షా చాలా ప్రయాసపడ్డాడు. ఓపెనర్‌గా వచ్చి కేవలం 0, 4 పరుగులతో పేలవమైన ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని మాజీలు సునీల్ గావస్కర్, రికీ పాంటింగ్ సహా ప్రముఖులు సూచించారు. అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకోవాలని తమ అభిప్రాయలను వెల్లడించారు.
ఇదీ చూడండి: కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. మీరే చూడండి!