బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(108*; 204 బంతుల్లో 9x4) శతకం సాధించగా, మాథ్యూవేడ్(45; 87 బంతుల్లో 6x4) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలిరోజు ఆటలో ఆసీస్‌దే పై చేయిగా నిలిచింది.
భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు. ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్(28*), కెప్టెన్ టిమ్‌పైన్(38*) క్రీజులో ఉన్నారు.