ETV Bharat / sports

ఆసీస్​పై టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

తొలి వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్​లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తోంది. మరి దెబ్బతిన్న టీమ్​ఇండియా ఏం చేస్తుందో చూడాలి? భారత కాలమాన ప్రకారం ఉదయం 9.10 నిమిషాలకు మ్యాచ్​ ప్రారంభం అవుతుంది.

IND vs AUS
ఆసీస్​పై టీమ్ఇండియా
author img

By

Published : Nov 29, 2020, 4:31 AM IST

లాక్​డౌన్​ తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్​లో ఓడిన టీమ్​ఇండియా.. అందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో వన్డేలో గెలిచి సిరీస్​ను సమం చేయాలని భావిస్తోంది. ఈ పోరులో గెలిచి తమ గెలుపును కొనసాగించాలని ఆసీస్ చూస్తోంది​. మరి ఎవరు నెగ్గుతారో?

ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఆసీస్​తో తొలి వన్డేలో 66 పరుగులు తేడాతో ఓడిపోయింది టీమ్​ఇండియా. హార్దిక్​ పాండ్య(90), ధావన్​(74) మినహా అందరూ విఫలమైపోయారు. బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్​ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు తేలిపోయారు. బౌలర్లలో షమి(3) ఒక్కడే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. జట్టులోని మిగతా ఆటగాళ్లు తమ ఆటను మెరుగుపరుచుకుని సమష్టిగా రాణిస్తేనే గెలిచే అవకాశముంది. లేదంటే సిరీస్​పై ఆశలు వదులుకోవడమే!

గెలుపు కొనసాగిస్తారా?

తొలి మ్యాచ్​లోనే భారత్​పై గెలిచి ఫుల్​జోష్​లో ఉంది ఆసీస్. ఫించ్​(114), స్మిత్​(105), వార్నర్​(69), మ్యాక్స్​వెల్​(45) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జంపా(4), హేజిల్​వుడ్​(3) బౌలింగ్​ ఆకట్టుకుంది. స్టొయినిస్​, క్యారీ, లబుషేన్​, ప్యాట్​ కమిన్స్​, స్టార్క్​ కూడా బాగా ఆడితే ప్రత్యర్థి జట్టుకు గెలుపు కష్టమే. తొలి మ్యాచ్​లో గాయమవ్వడం వల్ల స్టొయినిస్​ రెండో వన్డేకు దూరం కావొచ్చు. అతడి స్థానంలో కామెరూన్​​ గ్రీన్​, హెన్రిక్స్​లలో ఎవరో ఒకరు ఆడొచ్చు.

ఇదీ చూడండి :

గాయంతో రెండో వన్డేకు స్టొయినిస్​ దూరం!

తొలి వన్డే: ఆసీస్​ ఘనతలు.. భారత్​ చెత్త రికార్డులివే..

దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియాకు తప్పని ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.