ETV Bharat / sports

'భారత్​ను ఆస్ట్రేలియా చిత్తు చేస్తుంది' - నాథన్ లియోన్​

మెల్​బోర్న్​ టెస్టులో భారత్​కు మరోసారి చేదు అనుభవం తప్పదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ షేన్​ వార్న్. నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమ్​ఇండియాను ఆసీస్​ దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించాడు.

Australia will blow away India at MCG: Warne
'భారత్​ను ఆస్ట్రేలియా చిత్తు చేస్తుంది'
author img

By

Published : Dec 24, 2020, 1:51 PM IST

Updated : Dec 24, 2020, 2:09 PM IST

బాక్సింగ్​ డే టెస్టులో భారత్​ను ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిస్తుందని అంటున్నాడు ఆసీస్ స్పిన్​ దిగ్గజం షేన్​ వార్న్. తొలి టెస్టు పరాభవం నుంచి టీమ్​ఇండియా ఇంకా కోలుకోలేదని వ్యాఖ్యానించాడు. శనివారం జరగబోయే రెండో టెస్టుకు రక్షణ కవచం విరాట్​ కోహ్లీ అందుబాటులో ఉండడు. పితృత్వ సెలవులపై అతడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"భారత్​ను ఆస్ట్రేలియా చిత్తు చేస్తుంది. అయితే, టీమ్ఇండియాలోనూ కేఎల్​ రాహుల్, గిల్, అజింక్యా రహానె లాంటి ఉత్తమమైన ఆటగాళ్లు ఉన్నారు. పుజారా ఎంత నైపుణ్యవంతుడో అందరికీ తెలుసు. మెల్​బోర్న్​ పిచ్​లపై షమీ లాంటి ఆటగాడు విరుచుకుపడగలడు. అతను లేకపోవడం భారత్​కు లోటు."

-షేన్​ వార్న్, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​

భారత ఆటగాళ్లను విమర్శించడం కన్నా ఆసీస్​ బౌలర్లను ఎక్కువగా పొగడాలి అంటున్నాడు వార్న్. నలుగురు బౌలర్లు, ఆల్​రౌండర్​ గ్రీన్​.. మంచి బౌలర్ల నుంచి గొప్ప బౌలర్ల స్థాయికి ఎదుగుతున్నారని చెప్పాడు.

"భారత ఆటగాళ్లను విమర్శించవచ్చు. అయితే అద్భుత ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా బౌలర్లను మరింత ప్రశంసించాలి. కమిన్స్​, హేజిల్​వుడ్, మిచెల్​ స్టార్క్, నాథన్ లియోన్​లు ఆస్ట్రేలియా ఆల్​ టైం గ్రేట్​గా ఎదుగుతున్నారు."

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 36పరుగులతో కెరీర్​లోనే అత్యల్ప గణాంగాలు నమోదు చేసింది టీమ్​ఇండియా. దీంతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఇదీ చూడండి: 'పృథ్వీని మిడిలార్డర్​లో ఆడించాలి'

Last Updated : Dec 24, 2020, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.