ETV Bharat / sports

రెండో వన్డేలోనూ భారత్ ఓటమి.. సిరీస్​ ఆసీస్​దే - రెండో వన్డేలో భారత్​పై ఆసీస్​ విజయం

సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ కోహ్లీసేన ఓడిపోయింది. తమ శక్తిమేర పోరాడినప్పటికీ లక్ష్యం పెద్దదిగా ఉండటం వల్ల భారత బ్యాట్స్​మెన్ ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్​తో పాటు సిరీస్​ను ఆసీస్ గెల్చుకుంది.

australia
ఆస్ట్రేలియా
author img

By

Published : Nov 29, 2020, 5:17 PM IST

Updated : Nov 29, 2020, 5:23 PM IST

భారీ స్కోర్లు నమోదైన రెండో వన్డేలోనూ భారత్​పై 51 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్​ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. సెంచరీతో ఆకట్టుకున్న స్మిత్(104) విజయంలో కీలకపాత్ర పోషించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(80), ఫించ్(63) అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. అనంతరం వచ్చిన స్మిత్(104) సెంచరీతో చెలరేగాడు. లబుషేన్(70), మ్యాక్స్​వెల్(63) తమ వంతు సహాయం చేశారు. భారత బౌలర్లలో షమి, హార్దిక్, బుమ్రా తలో వికెట్ తీశారు.

australia
అర్ధ సెంచరీలు బాదిన ఆసీస్​ ఆటగాళ్లు
warner
వార్నర్​

ఛేదనను కోహ్లీసేన ధాటిగానే ప్రారంభించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(28), శిఖర్ ధావన్(30) ఫర్వాలేదనిపించారు. కోహ్లీ(89), కేఎల్ రాహుల్(76), హార్దిక్ పాండ్య(28), జడేజా(24) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (3), హేజిల్​వుడ్ (2), జంపా(2), హెన్రిక్స్, గ్లెన్​ మ్యాక్​వెల్​ తలో వికెట్ పడగొట్టారు.

kohli
కోహ్లీ

Last Updated : Nov 29, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.