ETV Bharat / sports

తొలిరోజు ఆట అదుర్స్​.. జింక్స్​పై ప్రశంసలు!

బాక్సింగ్​ డే టెస్టులో తొలిరోజు భారత్​ ఆధిపత్యం కనబరిచింది. కంగారూలను కట్టడి చేయడంలో అజింక్య రహానె ఎత్తులు ఫలించాయి. దీంతో మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

all are praisning test captain ajinkya rahane for his wonderful technics in second test
తొలిరోజు ఆట అదుర్స్​.. జింక్స్​పై ప్రశంసలు!
author img

By

Published : Dec 26, 2020, 7:31 PM IST

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా 195 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ మొదటి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అయితే కంగారూలను కట్టడి చేయడంలో సారథి అజింక్య రహానె ఎత్తులు ఫలించాయి. ఆట ప్రారంభమైన 11వ ఓవర్‌కే అశ్విన్‌తో బౌలింగ్ చేయించడం, తొలి మ్యాచ్‌ ఆడుతున్న సిరాజ్‌కు ఆలస్యంగా బంతిని అందించడం విజయవంతమైంది. దీంతో మాజీ క్రికెటర్లు జింక్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే సత్తాచాటిన బుమ్రా (4/56), అశ్విన్ (3/35), సిరాజ్‌ (2/40)ను కొనియాడుతున్నారు.

"బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డర్లను మోహరించడంలో రహానె అద్భుతంగా పనిచేశాడు. బౌలర్లు అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ అదరగొట్టారు. తెలివిగా బంతులు వేశారు. తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం బ్యాట్స్‌మెన్‌ చేతుల్లో ఉంది"

-- వీరేంద్ర సెహ్వాగ్‌

"మొదటి రోజు ఆట మాదే. బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. మంచి ముగింపు లభించింది" -- విరాట్ కోహ్లీ

"టీమిండియాదే తొలి రోజు. బౌలర్లు మరోసారి సంచలన ప్రదర్శన చేశారు. అరంగేట్ర మ్యాచ్‌లో సిరాజ్‌, గిల్‌ ఆత్మవిశ్వాసంతో ఆడారు. సారథిగా రహానె సత్తాచాటాడు. అడిలైడ్‌ టెస్టులోని లోపాలను పునరావృతం చేయలేదు." -- వీవీఎస్ లక్ష్మణ్‌

"తొలి రోజు ఆట గొప్పగా సాగింది. మెల్‌బోర్న్‌ మైదాన సిబ్బందికి శుభాకాంక్షలు. ఎంతోకాలం తర్వాత మంచి పిచ్‌ను సిద్ధంచేశారు. ఇలాంటి పిచ్‌లు మరిన్ని చేయాలి. ఇక భారత బౌలర్లు చక్కని ప్రదర్శన కనబరిచారు. జట్టును రహానె గొప్పగా ముందుకు నడిపించాడు. ఆదివారం మొత్తం టీమిండియా బ్యాటింగ్‌ చేయగలదా?" --షేన్‌ వార్న్‌

"బౌలర్లు సత్తాచాటారు. ఇక బ్యాట్స్‌మెన్ రాణించాలి" --ఇర్ఫాన్ పఠాన్‌

"ఆదిలోనే అశ్విన్‌కు బంతిని అందించడం, రెండో సెషన్‌లో సిరాజ్‌తో బౌలింగ్ చేయించిన రహానె నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎత్తులు ఫలించాయి" --ఆకాశ్ చోప్రా

ఇదీ చూడండి:తొలి రోజు: ఆసీస్​ 195 ఆలౌట్- 36/1 వద్ద భారత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.