ETV Bharat / sports

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీ20 వరల్డ్​కప్​ హీరో

author img

By

Published : Feb 3, 2023, 3:06 PM IST

Updated : Feb 3, 2023, 3:56 PM IST

టీమ్​ఇండియాకు మరో క్రికెటర్​ గుడ్​బై చెప్పాడు. 2007 టీ20 వరల్డ్​కప్ హీరో జోగిందర్​ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటింటాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్​ మీడియా వేదికగా వెల్లడించాడు. ​

Joginder Sharma retirement
Joginder Sharma retirement

టీమ్​ఇండియాకు మరో క్రికెటర్ జోగిందర్​ శర్మ రిటైర్మెంట్​ ప్రకటించాడు. 2007 టీ20 వరల్డ్​ కప్​ హీరో అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పాడు. ఈ మేరకు ట్వట్టర్​ వేదికగా తన రిటైర్మెంట్​ను ప్రకటించాడీ బౌలర్​. అంతర్జాతీయ క్రికెట్​ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని వెల్లడించాడు. కాగా, 2007 వరల్డ్​కప్​లో ఒకే ఓవర్​తో హీరో అయ్యాడు జోగిందర్​ శర్మ. ఫైనల్​ మ్యాచ్​లో ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్​ చివరి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడు జోగిందర్​ వేసిన బంతిని.. పాక్​​ బ్యాటర్​ స్కూప్​ షాట్​కు ప్రయత్నించగా అది​ మిస్​ అయింది. బంతి నేరుగా ఫీల్డర్ శ్రీషాంత్​ చేతుల్లో పడింది. దీంతో ఇండియా వరల్డ్​కప్​ గెలిచింది.

"2002 నుంచి 2017 వరకు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజులు. ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. అంతర్జాతీయం సహా అన్ని క్రికెట్‌కు ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. దాంతోపాటు నా జట్టు సభ్యులందరికి, కోచ్​లకు, మెంటర్లకు, సపోర్ట్​ స్టాఫ్​కు నా ధన్యవాదాలు. నా కల సాకారం చేసుకోవడంలో సహాయపడిన మీ అందరికీ ధన్యవాదాలు. డొమెస్టిక్ క్రికెట్‌లో నాకు సహకరించిన హరియాణా క్రికెట్‌ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మొదటిసారి ఐసీసీ నిర్వహించిన టీ20 వరల్డ్​కప్​లో గెలిచిన టీమ్​లో ఉండటం నా అదృష్టం. ఆ రోడు కెప్టెన్​ ధోని నన్ను నమ్మి బంతి చేతికిచ్చాడు. అలా ఒత్తిడితో బౌలింగ్​ వేసి టీమ్​ను గెలిపించడం మరచిపోలేని అనుభూతి. రిటైర్మెంట్‌ తర్వాత నాకు ఇష్టమైన క్రికెట్‌లోనే కొనసాగాలనుకుంటున్నా. భిన్నమైన వాతావరణంలో నన్ను నేను సవాల్​ చేసుకుంటూ ముందుకు సాగుతా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో ఇది తదుపరి దశ అనుకుంటున్నా.. నా జీవితంలో రాబోయే కొత్త చాప్టర్​ కోసం ఎదురుచూస్తున్నా''

--జోగిందర్​ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఇక, ఐపీఎల్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి కొవిడ్​లో సమయంలో సమర్థంగా పనిచేశాడు. చివరగా లెజెండ్స్​ లీగ్​లో మెరిశాడు ఈ క్రికెటర్​. 2004లో బంగ్లాదేశ్​తో జరిగిన ఓడీఐ మ్యాచ్​తో ఇంటర్నేషనల్​ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు మొత్త ఐదు వన్డే మ్యాచ్​ల్లో ఆడాడు. టీ20 మ్యాచ్​ల్లో మంచి ప్రదర్శన చేశాడు. దేశవాళీ క్రికెట్​లో జోగిందర్​ శర్మ హరియాణా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2004 నుంచి 2007 వరకు టీమ్​ఇండియాకు ప్రాతినిధ్య వహించాడు. కాగా, 2007లో జరిగిన మొట్ట మొదటి టీ20 ప్రపంచకప్​లో కీలక ప్రదర్శన చేశాడు. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించాడు.

Last Updated : Feb 3, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.