ETV Bharat / sports

Ind vs Eng: 'తప్పులు గ్రహించాం.. వివాదాలకు దూరంగా ఉంటాం' - ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్​ టెస్టులో (Ind vs Eng) తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్​ (Joe Root) తెలిపాడు. తర్వాతి టెస్టులో వివాదాలకు దూరంగా నిజాయితీగా ఆడతామని వెల్లడించాడు. రెండో టెస్టులో ఇరుజట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొగా.. అది మ్యాచ్​ ఫలితంపై ప్రభావం చూపించింది.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 24, 2021, 11:21 AM IST

లార్డ్స్​ టెస్టు (India vs England) నుంచి తమ తప్పులను గ్రహించినట్లు తెలిపాడు ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్ (Joe Root). బుధవారం నుంచి లీడ్స్​ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్​లో తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించాడు.

"మేము నిజాయితీగా ఆడాలనుకుంటున్నాం. లార్డ్స్ టెస్టు నుంచి పలు పాఠాలు నేర్చుకున్నాం. ఎటువంటి వివాదాల జోలికి పోకుండా ఆటపైనే దృష్టి సారించాలనుకుంటున్నాం. కోహ్లీ సేన ఆడిన విధంగానే మేము మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాం" అని రూట్​ పేర్కొన్నారు.

లార్డ్స్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుమ్రా- అండర్సన్, కోహ్లీ- అండర్సన్, బుమ్రా- బట్లర్​ మధ్య వాగ్వాదం జరిగింది. దీని ఫలితం మ్యాచ్​పై కనిపించింది.​ ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ సిరీస్​లో ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉన్నాయని రూట్​ పేర్కొన్నాడు. వాటిల్లో గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్నట్లు తెలిపాడు. సిరీస్​ను గెలవడానికి తమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించాడు.

సిబ్లీ దూరం..

మూడో టెస్టుకు డామ్ సిబ్లీని పక్కన పెడుతున్నట్లు సారథి రూట్​ తెలిపాడు. అతడి స్థానంలో డేవిడ్ మలన్​ను తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి మలన్​ను తీసుకుంది ఇంగ్లాండ్. 'మలన్​ అనుభవం మాకు ఉపయోగపడనుంది. టాపార్డర్​లో ఒత్తిడిని తట్టుకుని నిలబడగల సామర్థ్యం అతనికి ఉంది. అతడు ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడాడు' అని రూట్​ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: కోహ్లీ సన్నిహితుడే కాబోయే ప్రధాన కోచ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.