Team india Rohit sharma: మూడో టీ20లోనూ టీమ్ఇండియా గెలిచింది. కోల్‌కతాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
టీ20ల్లో టాప్..
సిరీస్ విజయంతో టీ20 ర్యాంకింగ్స్‌లో 269 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ను వెనక్కునెట్టింది టీమ్ఇండియా. దాదాపు ఆరేళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో తొలి స్థానానికి చేరుకుంది. అంతకుముందు 2016 ఫిబ్రవరిలో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అగ్రస్థానంలో ఉంది భారత్.
సూర్య, అయ్యర్ మెరుపులు..
మూడో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్(65) అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్(35) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇషాన్ కిషన్ 34 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్, షెపార్డ్, ఛేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనను ప్రారంభించిన కరీబియన్ జట్టు.. ధాటిగానే బ్యాటింగ్ చేసింది. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల నిర్ణీత ఓవర్లలో 167/9 పరుగులే చేయగలిగింది.
విండీస్ బ్యాటర్లలో పూరన్(61).. మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో పొవెల్ 25, మేయర్స్ 6, హోప్ 8, పొలార్డ్ 5, హోల్డర్ 2, ఛేజ్ 12, షెపార్డ్ 29 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, వెంకటేశ్ అయ్యర్ తలో రెండు వికెట్లు తీశారు.
ఇవీ చదవండి: