వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమ్ఇండియా అదరగొట్టింది. బంతితో, బ్యాట్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్ (35), సూర్యకుమార్(34), వెంకటేష్ అయ్యర్(24) రాణించడం వల్ల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. విండీస్ బౌలర్లలో ఛేజ్ 2 వికెట్లు తీయగా, అలెన్-కాట్రెల్ తలో వికెట్ పడగొట్టారు.
-
Venkatesh Iyer hits the winning runs for #TeamIndia as we win by 6 wickets.@Paytm #INDvWI pic.twitter.com/aaE7FUOR9J
— BCCI (@BCCI) February 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Venkatesh Iyer hits the winning runs for #TeamIndia as we win by 6 wickets.@Paytm #INDvWI pic.twitter.com/aaE7FUOR9J
— BCCI (@BCCI) February 16, 2022Venkatesh Iyer hits the winning runs for #TeamIndia as we win by 6 wickets.@Paytm #INDvWI pic.twitter.com/aaE7FUOR9J
— BCCI (@BCCI) February 16, 2022
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత ఓవర్లలో 157/7 స్కోరు మాత్రమే చేయగలిగింది. పూరన్(61) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. మేయర్స్(31), పొలార్డ్(24) తమ వంతు సాయం అందించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చాహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.
ఇది చదవండి: టీ20లో అత్యధిక పరుగులు.. రోహిత్-కోహ్లీ దోబూచులాట